Home  »  News  »  పవన్ కళ్యాణ్ మరల పాత అవతారం ఎత్తాడు!

Updated : Jan 3, 2023

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు షూటింగ్ జరుగుతోంది. ఏఎం రత్నం నిర్మాతగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది.  ఇటీవల 40 రోజుల లాంగ్ షెడ్యూల్ పూర్తి చేశారు. రామోజీ ఫిలిం సిటీ లో పలు యాక్షన్ సీన్స్ చిత్రీకరించారు. ఇందులో పవన్ తో పాటు ప్రధాన తారాగాణ‌మంతా పాల్గొన్నారు. సినిమాలో ఈ యాక్షన్స్ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణ నిలవనున్నాయని అంటున్నారు. వీటికి స్టంట్ మాస్టర్ విజయ్ స్టంట్ కొరియోగ్రఫీ చేశారు.  ఈ షెడ్యూల్ కి భారీగానే ఖర్చు చేశారట. షెడ్యూల్ ప్రారంభానికి ముందు వర్క్ షాప్ కూడా నిర్వహించారు. దీనికి పవన్ కూడా హాజరయ్యారు. 

కాగా ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ మరోసారి స్టంట్‌ మాస్టర్ గా మారిపోయారా? అంటే అవుననే అంటున్నారు. ఆయన మాస్టర్ విజయ్ తో కలిసి యాక్ష‌న్ సీన్స్‌ ను కొరియోగ్రఫీ చేశారట. దాదాపు 20 ఏళ్ల కిందటి మార్షల్ ఆర్ట్స్ ని మరలా పవన్ కళ్యాణ్ తెర‌పైకి తెచ్చారు అంటున్నారు. మార్షల్ ఆర్ట్స్ లో పవన్ కళ్యాణ్ కు మంచి ప్రావీణ్యం ఉంది. ఆరంభంలో ఆయన చేసిన సాహసాలు తెలిసిందే. మొదటి చిత్రం అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి చిత్రంలో తన చేతుల మీద నుంచి కార్లు వెళ్లేలా రియల్ గా షూట్ చేశారు. ఇక జానీ సినిమాకు తానే స్టంట్స్‌ కొరియోగ్రఫీ చేశారు. ఇంకా చాలా అవసరమైన సందర్భాలలో పవన్ తన సొంత క్రియేటివిటీ వాడిన  సందర్భాలు ఉన్నాయి. మరల ఇంత కాలానికి మార్షల్ ఆర్ట్స్ అవసరం పడటంతో పవన్ మళ్లీ రంగంలోకి దిగార‌ట. 

ఈ చిత్రంలోని కొన్ని కీలక సన్నివేశాలకు పవన్ స్వయంగా యాక్షన్ సీన్స్ డిజైన్ చేశారని తెలుస్తోంది. వాటిని విజయ్‌తో కలిసి కొరియోగ్రఫీ చేశారంటున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ లో మార్షల్ ఆర్ట్స్ ఫోజులో పీకే హైలెట్ అవుతున్నారు.  కత్తి తిప్పడం, తలకాయ మెడ మీద నుంచి కత్తి దూయ‌డం వంటి సన్నివేశాలన్నీ పీకే క్రియేటివిటీగా కనిపిస్తున్నాయి.మొత్తానికి పీకే హస్తం ఈ రకంగానూ ఈ మూవీకి కీలకంగా మారబోతోంది. మరి మున్ముందు  షూట్ చేయాల్సిన యాక్షన్ సీన్స్ లో కూడా పీకే భాగస్వామ్యం ఉంటుందా లేదా? అనేది వేచి చూడాలి...!






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.