![]() |
![]() |

తెలుగులో ఆ మధ్య విడుదలైన 'క్రాక్' చిత్రం ద్వారా ఎంతో పేరు తెచ్చుకున్న విలక్షణ నటి వరలక్ష్మి శరత్ కుమార్. ఈ చిత్రంలో ఆమె పేరు జయమ్మ. దాంతో ఈమెను అందరూ వరలక్ష్మి శరత్ కుమార్ అని కాకుండా 'జయమ్మ' అనే పిలుస్తున్నారు. ఇక జయమ్మ తమిళ సీనియర్ హీరో శరత్ కుమార్, ఆయన మొదటి భార్య ఛాయకు పుట్టిన అమ్మాయి.
ఈమె సవతి తల్లి సీనియర్ హీరోయిన్ రాధిక. కాగా మొదట్లో ఈమె తమిళ తెలుగు హీరో విశాల్ తో ప్రేమలో పడిందని, పెళ్లి చేసుకుంటుందని వార్తలు వచ్చాయి. కానీ ఎందుకనో ఆ తరువాత మరలా ఊసే లేదు. ఇక వరలక్ష్మి శరత్ కుమార్ తెలుగులో కూడా పలు చిత్రాలలో నటించింది. 'తెనాలి రామకృష్ణ బీఏ బి ఎల్', 'క్రాక్', 'నాంది' చిత్రాల్లో నటించిన ఈమె 'పక్కా కమర్షియల్' చిత్రంలో కామియో రోల్‌ను పోషించింది. వీటితో పాటు తెలుగులో ప్రస్తుతం ఆమె శబరి, వీరసింహారెడ్డి, హనుమాన్ అనే చిత్రాలను చేస్తోంది.
నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న 'వీరసింహారెడ్డి'లో ఈమె పాత్ర చాలా విభిన్నంగా, వైవిధ్యంగా ఉంటుందట. ఈమెకు హీరోయిన్ గా కంటే మంచి నటిగానే గుర్తింపు వస్తోంది. 'క్రాక్' చిత్రంలో ఈమె పాత్రకు ఎంతటి గుర్తింపు వచ్చిందో, 'వీరసింహారెడ్డి'లో ఈమె చేసిన పాత్రకు అంతకుమించి పేరు ప్రఖ్యాతలు వస్తాయని అంటున్నారు. ఈ రెండు చిత్రాలకు గోపిచంద్ మలినేని దర్శకుడు కావడం గమనార్హం. ఈ మూవీలో బాలయ్య వరలక్ష్మీల మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను సర్ ప్రైజ్ కు గురి చేస్తాయట. హీరోయిన్‌గా అవకాశాలు వస్తున్నా కూడా నటిగా తనేంటో నిరూపించేందుకు వరలక్ష్మి ఇలాంటి పాత్రలు చేస్తూ ఉంది. 'వీరసింహారెడ్డి' సినిమాలో వరలక్ష్మీ పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందని, ముఖ్యంగా ఆమె పాత్రలో వచ్చే ట్విస్ట్ అందరి మతులను పోగొడతాయని తెలుస్తోంది.
ఈ పాత్ర మీదనే సినిమా ఫలితం ఆధారపడి ఉందని చెప్పడం కూడా అతిశయోక్తి కాదని కొందరు అంటున్నారు. ఆమె పాత్రను ప్రేక్షకులు అర్థం చేసుకొని ఓన్ చేసుకుంటే తప్పకుండా ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది అని యూనిట్ సభ్యులు నమ్మకంతో అంటున్నారు. ఈ చిత్రం గనుక సక్సెస్ అయితే టాలీవుడ్ లో వరలక్ష్మి మరింత బిజీ అయ్యే అవకాశాలున్నాయి.
ప్రస్తుతం ఆమె చేతిలో అరడజను చిత్రాలు ఉన్నాయి. అవి వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. మొత్తానికి బాలయ్య చిత్రంలో ఈమె పాత్ర బాలయ్యకు పోటాపోటీగా ఉండి బాలయ్యతో ధీటుగా నటిస్తే మాత్రం ఈమె మరింత గుర్తింపు తెచ్చుకుని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారే అవకాశాలు ఉన్నాయనే చెప్పాలి.. రవితేజ చిత్రంలో నటిస్తే వచ్చే గుర్తింపు కంటే బాలయ్యతో పోటీపడితే వచ్చే మైలేజ్ పదింతలు ఎక్కువ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
![]() |
![]() |