![]() |
![]() |

ఈ మధ్య కాలంలో మూవీ ఇండస్ట్రీ అంటే ఒకరి మీద ఒకరు దుమ్మెత్తిపోసుకోవడమే కనిపిస్తోంది. మొదట్లో ఫ్లోలో మాట్లాడేయడం..తర్వాత సారీ, క్షమించండి అంటూ ఒక వీడియోని వదలడం చాలా కామన్ ఐపోయింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. రీసెంట్ గా షకలక శంకర్ నటించిన "రాజయోగం" మూవీ రిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా ఓ కాంట్రవర్సీ ప్రొడ్యూసర్ మీద కామెంట్ చేయబోతూ ఒక హీరో గురించి నోరు జారేసాడు. విషయం ఏమిటి అంటే "ధమాకా" సక్సెస్ మీట్ లో నటుడు, నిర్మాత బండ్ల గణేష్ స్పీచ్ తో స్టేజ్ మీదకు వచ్చి ‘అందరూ రెండు మూడేళ్లు ట్రై చేసి.. అదృష్టం కలిసొచ్చి సూపర్ స్టార్స్, మెగా స్టార్స్ అయిపోతారు’ అంటూ వ్యాఖ్యానించాడు.
దీంతో "రాజయోగం" మూవీ ప్రమోషన్స్ లో బండ్ల గణేష్ అన్న మాటలపై షకలక శంకర్ రియాక్ట్ అవుతూ.. “మొన్న ఓ ప్రొడ్యూసర్ అన్నాడు.. రెండుమూడేళ్లకే అదృష్టం కలిసొచ్చి మెగాస్టార్లు, సూపర్ స్టార్లు అయిపోతారని. ఎన్నో ఏళ్ళు కష్టపడి పైకొచ్చారు. అనేవాడికి తెలియాలి ఎందుకన్నాడో అన్న విషయం... నీ ఎదురుగా ఎవడో హీరో ఉంటే ఉబ్బితబ్బిబ్బై అలా మాట్లాడకూడదు” అన్నాడు. ఆ ధమాకా మీట్ లో బండ్ల గణేష్ ఎదురుగా ఉంది రవితేజ కాబట్టి.. రవితేజనే "ఎవడు అంటావా" అని ఫ్యాన్స్, నెటిజన్స్ ఫైర్ అయ్యారు. దాంతో చేసేదేం లేక లేటెస్ట్ గా ఒక వీడియోని రిలీజ్ చేసాడు. “ఫ్లోలో మిమ్మల్ని వాడు, వీడు అనేశాను. వీలైతే క్షమించండి రవితేజ అన్నయ్య.. ఫ్యాన్స్ క్షమించండి” అని చెప్పుకొచ్చాడు.
![]() |
![]() |