![]() |
![]() |

సినిమా ఇండస్ట్రీలో ప్రతిదీ న్యూసే. అందులోనూ స్టార్ హీరోలు, హీరోయిన్లకు సంబంధించిన విషయాలైతే మరీ క్షణాల్లో స్ప్రెడ్ అవుతుంటాయి. లేటెస్ట్ గా సీనియర్ హీరోలతో శ్రుతిహాసన్ ఎందుకు సినిమాలు చేస్తున్నారనే విషయం వైరల్ అవుతోంది. మెగాస్టార్ చిరంజీవి పక్కన వాల్తేరు వీరయ్యలో నటించారు శ్రుతిహాసన్. నందమూరి బాలకృష్ణ సరసన వీరసింహారెడ్డిలోనూ ఆమే నాయిక. వీరిద్దరితో నటించడం గురించి శ్రుతికి ఓ ప్రశ్న ఎదురైంది. సీనియర్ హీరోలతో నటించడానికి ఎందుకు ఒప్పుకుంటున్నారు? అని... దానికి శ్రుతి తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.
``నటనలో వయసు మీద పడ్డవాళ్లు, కుర్రవాళ్లు అనే లెక్కలుండవు. తెరమీద ఆ పాత్రకు తగ్గ జోడీ ఎవరనిపిస్తే, వారిని సెలక్ట్ చేస్తారు. అక్కడ నటనను చూడాలేగానీ, వయసు గురించి లెక్కలు వేసుకోకూడదు. పైగా తమకన్నా 20 ఏళ్లు పెద్దవారికి జోడీగా నటించిన నాయికలు మన దగ్గర కోకొల్లలు. ఇండస్ట్రీ తొలినాళ్ల నుంచీ ఈ సంప్రదాయం ఉంది. నేనేం కొత్తగా చేస్తున్నది కాదు. నాతోనే మొదలైందీ కాదు. అందుకే నేనెప్పుడూ ఏజ్ గురించి పట్టించుకోను.
డైరక్టర్ కథ చెప్పినప్పుడు నాకు సూట్ అవుతుందా? లేదా? నా పాత్రకు ఎంత ఇంపార్టెన్స్ ఉంది అని మాత్రం ఆలోచిస్తాను. అంతే కాదు, నేను సీనియర్ల పక్కన నటించడానికి ఎక్కువ పారితోషికం తీసుకుంటున్నానని కూడా చాలా మంది అనుకుంటున్నారు. అది తప్పుడు అభిప్రాయం. హీరోల ఏజ్‌ని బట్టి పారితోషికం తీసుకునే రకం నేను కాదు. ఏ సినిమాకైనా ఒకటే పారితోషికం తీసుకుంటున్నాను. ఈ విషయాన్ని అందరూ గమనించాలి`` అని అన్నారు. సలార్‌లో ప్రభాస్ పక్కన కూడా హీరోయిన్‌గా నటిస్తున్నారు శ్రుతిహాసన్.
![]() |
![]() |