![]() |
![]() |
.webp)
మణిరత్నం దర్శకత్వంలో త్రిష ఎప్పుడో నటించారు కదా.. ఇప్పుడు కొత్తేంటి అనుకుంటున్నారా? అప్పుడెప్పుడో నటించడం కాదు... మణిరత్నం - త్రిష కాంబినేషన్‌లో వరుసగా మూడేళ్లు మూడు సినిమాలు రిలీజ్ కావడం ఇప్పుడు కోడంబాక్కంలో పెద్ద న్యూస్ గా మారింది.
2022లో మణిరత్నం దర్శకత్వంలో పొన్నియిన్ సెల్వన్ పార్ట్ ఒన్‌లో నటించారు త్రిష. ఇందులో కుందవై కేరక్టర్‌లో గ్రేస్‌ఫుల్‌గా కనిపించారు చెన్నై సుందరి. వీరి కాంబోలో 2023లోనూ పొన్నియిన్ సెల్వన్ 2 రిలీజ్‌కి రెడీ అవుతోంది. సమ్మర్‌లో కుందవై సందడి మామూలుగా ఉండదంటున్నారు క్రిటిక్స్.
2024లోనూ సేమ్ కాంబో రిపీట్ కానుంది. మణిరత్నం దర్శకత్వంలో కమల్‌హాసన్ నటించే సినిమాలో నాయికగా త్రిషను ఎంపిక చేశారన్నది లేటెస్ట్ న్యూస్. ప్రస్తుతం విక్రమ్ సీక్వెల్ కోసం సిద్ధమవుతున్నారు కమల్‌హాసన్. అది పూర్తి కాగానే నేరుగా మణిరత్నంసెట్స్ కి వెళ్తారు. కమల్‌హాసన్ నటిస్తున్న 234వ సినిమా ఇది. రెడ్ జెయింట్ సంస్థ నిర్మిస్తోంది. కమల్‌హాసన్ రాజ్‌కమల్ ఫిల్మ్స్, మణిరత్నం మెడ్రాస్ టాకీస్ కూడా నిర్మాణభాగస్వామ్యంలో ఉన్నాయి. 1987లో మణిరత్నం దర్శకత్వంలో నాయకుడు సినిమా చేశారు కమల్‌హాసన్. దాదాపు 35 ఏళ్ల తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా రానుంది. ఈ సినిమాలోనే త్రిషను నాయికగా ఎంపిక చేశారట.
కమల్ సరసన నటించడం త్రిషకి కొత్తేం కాదు. ఆల్రెడీ వీరిద్దరి కాంబినేషన్‌లో తమిళంలో మన్మద అంబు, తూంగావనం సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమాకు సైన్ చేశారట త్రిష.ఆల్రెడీ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ పక్కన త్రిష నటిస్తున్నారనే న్యూస్ కూడా వైరల్ అవుతోంది. దీన్ని బట్టి ఇండస్ట్రీలో 20 ఏళ్లు జరుపుకుంటున్న త్రిష, ఇప్పుడు మరింత బిజీగా మారారన్నమాట.
![]() |
![]() |