![]() |
![]() |
.webp)
సంక్రాంతి బరి నుంచి 'ఆదిపురుష్' మూవీ తప్పుకుందని, వేసవిలో మార్చి 30న విడుదలయ్యే అవకాశముందని ఇటీవల వార్తలొచ్చాయి. అయితే 'ఆదిపురుష్' మార్చిలో కూడా విడుదలయ్యే అవకాశం లేదని, మరింత ఆలస్యమయ్యే అవకాశముందని న్యూస్ వినిపిస్తోంది.
రెబల్ స్టార్ ప్రభాస్ శ్రీరాముడిగా కనువిందు చేయనున్న చిత్రం 'ఆదిపురుష్'. రామాయణం ఆధారంగా రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో టి.సిరీస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకుడు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా 2023, జనవరి 12న విడుదల చేయబోతున్నట్లు ఎప్పుడో ప్రకటించారు. అయితే ఇటీవల విడుదలైన 'ఆదిపురుష్' టీజర్ నెగటివ్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా గ్రాఫిక్స్.. సినిమా స్థాయికి తగ్గట్టు లేవన్న విమర్శలు వచ్చాయి. అందుకే కంగారు కంగారుగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేయకుండా.. మరికొంత సమయం తీసుకొని మంచి అవుట్ పుట్ ఇవ్వాలని మూవీ టీమ్ భావిస్తోందట. వీఎఫ్ఎక్స్ వర్క్ మళ్ళీ చేయబోతున్నారని, దీనికోసం మరింత సమయం, డబ్బు వెచ్చించాలని మేకర్స్ నిర్ణయించారని అంటున్నారు. ఈ సినిమా జూన్ లో విడుదలయ్యే అవకాశముందని సమాచారం.
![]() |
![]() |