![]() |
![]() |

గతేడాది 'నాంది' సినిమాతో ఆకట్టుకున్న అల్లరి నరేష్ ఈ ఏడాది 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' అనే సినిమాతో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. మొదట ఈ చిత్రాన్ని నవంబర్ 11 విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు ఈ మూవీ విడుదల తేదీ మారింది.
జీ స్టూడియోస్ తో కలిసి హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ మోహన్ దర్శకుడు. ఇప్పటికే విడుదలైన టీజర్ ఆకట్టుకుంది. ఇందులో ఆదివాసీల ఓటు హక్కు కోసం పోరాడే ఎన్నికల అధికారిగా నరేష్ కనిపించనున్నాడు. 'నాంది' తర్వాత నరేష్ నటించిన మరో కథాబలమున్న చిత్రం కావడంతో 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'పై ప్రేక్షకుల్లో బాగానే ఆసక్తి నెలకొంది. మొదటి ఈ చిత్రాన్ని నవంబర్ 11 విడుదల చేయాలని అనుకున్నారు. అయితే ఇప్పుడు ఈ చిత్రాన్ని నవంబర్ 25 న విడుదల చేయబోతున్నట్టు తాజాగా మేకర్స్ ప్రకటించారు.
ఆనంది హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్ రాజ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల కాగా.. సినిమాటోగ్రాఫర్ గా రామ్ రెడ్డి, ఎడిటర్ గా ఛోటా కె. ప్రసాద్ వ్యవహరిస్తున్నారు.
![]() |
![]() |