![]() |
![]() |

ప్రముఖ సినీ నటి రంభ కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో రంభకు స్వల్ప గాయాలు కాగా, ఆమె చిన్న కూతురుకు మాత్రం తీవ్ర గాయాలు అయినట్టు తెలుస్తోంది.
రంభ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకొని కెనడాలో సెటిల్ అయింది. ఆమెకు వారికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సోమవారం సాయంత్రం స్కూల్ నుంచి పిల్లల్ని తీసుకొస్తుండగా వారు ప్రయాణిస్తున్న కారుని మరో కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అందరూ స్వల్ప గాయాలతో బయటపడగా, రంభ చిన్న కూతురు సాషా మాత్రం బాగానే గాయపడినట్టు సమాచారం. ప్రస్తుతం సాషాకి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
![]() |
![]() |