![]() |
![]() |

కమెడియన్ ఆలీ నిర్మాతగా మారాడు. ఆలీవుడ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ అనే బ్యానర్ ను నెలకొల్పి 'అందరూ బాగుండాలి అందులో నేనుండాలి' అనే చిత్రాన్ని నిర్మించాడు. ఆసక్తికరమైన కథా కథనాలతో సహజత్వానికి దగ్గరగా ఉండేలా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. ఇందులో నరేష్, పవిత్రా లోకేష్ జంటగా కనిపించబోతుండటం విశేషం. నరేష్, పవిత్ర పాత్రల జీవితాల్లో.. అలీ పాత్ర ఎలాంటి అలజడి సృష్టించిందనే కోణంలో వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయని అంటున్నారు.

మలయాళ సినిమా 'వికృతి'కి ఇది రీమేక్. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఒక ఫోటో ఎలాంటి పరిణామాలకు దారి తీసిందనే పాయింట్ తో ఈ కథ ఉంటుంది. అద్భుతమైన ఎమోషన్స్, సస్పెన్స్ తో రూపొందిన ఈ చిత్రం ఓటీటీ వేదిక ఆహాలో ఈ నెల 28న రాబోతుంది. శ్రీపురం కిరణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆలీ, నరేష్, పవిత్రా లోకేష్ ప్రధాన పాత్రల దారులుగా కనిపించనుండగా.. మౌర్యాని, మంజుభార్గవి, తనికెళ్ల భరణి, ఎస్వీ కృష్ణారెడ్డి, సప్తగిరి, పృధ్వీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి రాకేశ్ పళిదం సంగీతం అందించగా.. సినిమాటోగ్రాఫర్ గా ఎస్. మురళీమోహన్ రెడ్డి వ్యవహరించారు. మరి ఈ చిత్రం నిర్మాతగా ఆలీకి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.
![]() |
![]() |