![]() |
![]() |

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ శ్రీరాముడిగా కనువిందు చేయనున్న చిత్రం 'ఆదిపురుష్'. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా పౌరాణిక నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకుడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ విడుదలై ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి మరో పోస్టర్ విడుదలైంది.
నేడు(అక్టోబర్ 23) ప్రభాస్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ప్రభాస్ కి శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ప్రత్యేక పోస్టర్ ని విడుదల చేసింది మూవీ టీమ్. విల్లు ధరించి వానర సైన్యంతో కలిసి రామసేతుపై నడిచొస్తున్న రాముడి రూపంలో ఉన్న ప్రభాస్ లుక్ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

టి. సిరీస్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. తెలుగు, హిందీతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం జనవరి 12, 2023 న విడుదల కానుంది.
![]() |
![]() |