![]() |
![]() |

నటసింహం నందమూరి బాలకృష్ణ తన 107వ సినిమాని గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. 'అఖండ' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాలయ్య నటిస్తున్న సినిమా కావడంతో 'NBK 107'పై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక త్వరలో ఈ మూవీ టైటిల్ ని ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న 'NBK 107' టైటిల్ ని ఈ శనివారం(అక్టోబర్ 15న) రివీల్ చేయబోతున్నారని న్యూస్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి 'రెడ్డి గారు', 'వీర సింహా రెడ్డి' అనే రెండు పవర్ ఫుల్ టైటిల్స్ పరిశీలిస్తున్నారట. అయితే బాలయ్యతో పాటు మిగతా మూవీ టీమ్ కూడా 'రెడ్డి గారు' టైటిల్ కే ఎక్కువ మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు నందమూరి అభిమానులు సైతం 'రెడ్డి గారు' టైటిలే బాగుందన్న అభిప్రాయం సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తున్నారు. మరి మూవీ టీమ్ ఈ రెండు టైటిల్స్ లో 'రెడ్డి గారు'కి ఓటేస్తుందో లేక మరో కొత్త టైటిల్ ప్రకటించి సర్ ప్రైజ్ చేస్తుందో చూడాలి.
ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్, హనీ రోజ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది.
![]() |
![]() |