![]() |
![]() |

'ఆర్ఆర్ఆర్', 'ది కాశ్మీర్ ఫైల్స్' వంటి చిత్రాలను వెనక్కి నెట్టి ఆస్కార్ నామినేషన్స్ కోసం భారత్ తరఫున 'ఛెల్లో షో' అనే గుజరాతీ సినిమా ఎంపికైన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలో నటించిన బాలనటుడు తాజాగా మృతి చెందాడు.
'ఛెల్లో షో'లో భవిన్ రాబారి ప్రధాన పాత్ర పోషించగా అతని స్నేహితుడి పాత్రలో రాహుల్ కోలి నటించాడు. అయితే కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న కోలి ఇటీవల కన్నుమూశాడు. అక్టోబర్ 14న విడుదలవుతున్న ఈ చిత్రాన్ని తమ కుమారుడితో కలిసి థియేటర్ లో చూడాలనుకున్నామని కానీ ఇంతలోనే ఇలా జరిగిందంటూ రాహుల్ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. మరణించే సమయానికి రాహుల్ కోలి వయస్సు 10 ఏళ్ళు మాత్రమే.
ఇప్పటికే పలు ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శితమై ప్రశంసలు అందుకున్న 'ఛెల్లో షో' చిత్రం అక్టోబర్ 14న థియేటర్స్ లో విడుదల కానుంది.
![]() |
![]() |