![]() |
![]() |

'కేజీఎఫ్' తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియుల్లో కన్నడ సినిమాలపై ఆసక్తి పెరుగుతోంది. 'కేజీఎఫ్'ను నిర్మించిన హోంబలే ఫిలిమ్స్ నుంచి ఇటీవల 'కాంతార' అనే సినిమా వచ్చింది. కన్నడలో సెప్టెంబర్ 30న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకొని థియేటర్స్ లో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఇప్పుడు ఈ సినిమా తెలుగుతో పాటు పలు భాషల్లో అలరించడానికి సిద్ధమవుతోంది.
'కాంతార' చిత్రానికి రిషబ్ శెట్టి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో రిషబ్ తో పాటు సప్తమి, కిషోర్, అచ్యుత్ కుమార్ తదితరులు నటించారు. కన్నడలో ఈ చిత్రానికి విశేష ఆదరణ లభిస్తుండటంతో.. ఈ చిత్రాన్ని ఇతర భాషల్లోకి డబ్ చేసి విడుదల చేయాలన్న డిమాండ్స్ వినిపించాయి.

తెలుగులో 'కాంతార'ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ విడుదల చేస్తున్నారు. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ చిత్రం అక్టోబర్ 15న ఈ చిత్రం విడుదల కానుంది. తాజాగా విడుదల చేసిన 'కాంతార' తెలుగు ట్రైలర్ ఆకట్టుకుంటోంది. తెలుగులోనూ ఈ చిత్రం ఊహించని విజయాన్ని అందుకుంటుందేమో చూడాలి. అలాగే హిందీ, తమిళ్, మలయాళ భాషల్లోనూ ఈ చిత్రం విడుదలవుతోంది.
![]() |
![]() |