![]() |
![]() |

'ఆచార్య' వంటి డిజాస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్' నిన్న(అక్టోబర్ 5న) విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకుంది. సినిమా అయితే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది కానీ ఫస్ట్ డే కలెక్షన్లు మాత్రం మెగాస్టార్ రేంజ్ కి తగ్గట్టుగా లేవు. చిరంజీవి గత చిత్రం 'ఆచార్య'తో పోల్చితే అందులో సగం కూడా 'గాడ్ ఫాదర్'కి ఓపెనింగ్స్ రాలేదు.
ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో రూ.70.50 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన 'గాడ్ ఫాదర్' మొదటి రోజు రూ.12.97 కోట్ల షేర్ రాబట్టింది. రీఎంట్రీ తర్వాత చిరంజీవి నటించిన 'ఖైదీ నెం.150' రూ.23.25 కోట్ల షేర్, 'సైరా నరసింహారెడ్డి' రూ.38.75 కోట్ల షేర్, 'ఆచార్య' రూ.29.50 కోట్ల షేర్ ఫస్ట్ డే తెలుగు స్టేట్స్ లో రాబట్టడం విశేషం. ఆ మూడు సినిమాలతో పోల్చితే 'గాడ్ ఫాదర్' ఓపెనింగ్స్ దారుణంగా ఉండటానికి పలు కారణాలు ఉన్నాయి. 'గాడ్ ఫాదర్' తక్కువ థియేటర్స్ లో విడుదలైంది. ఇది 'ఆచార్య' వంటి ఘోర పరాజయం తర్వాత వస్తున్న సినిమా కావడంతో పాటు రీమేక్ సినిమా కావడం, మెగాస్టార్ మార్క్ కమర్షియల్ సినిమా కాకపోవడంతో ఫ్యాన్స్ సైతం పెద్దగా ఆసక్తి చూపలేదు. అలాగే 'సైరా'కి 14.03 కోట్ల హైర్స్, 'ఆచార్య'కి 10.81 కోట్ల హైర్స్ కలవడం వల్ల ఆ సినిమాల ఫస్ట్ డే కలెక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి. 'గాడ్ ఫాదర్' హైర్స్ కేవలం 1.28 కోట్లే కావడం కూడా మొదటి రోజు కలెక్షన్లపై ప్రభావం చూపించింది. ఇలా పలు కారణాల వల్ల తెలుగు రాష్ట్రాల్లో 'గాడ్ ఫాదర్'కి మెగా రేంజ్ కలెక్షన్స్ రాలేదు.
తెలుగు స్టేట్స్ లో ఏరియాల వారీగా చూస్తే 'గాడ్ ఫాదర్ మొదటి రోజు నైజాంలో రూ.3.29 కోట్ల షేర్, సీడెడ్ లో రూ.3.18 కోట్ల షేర్, ఆంధ్రాలో రూ.6.50 కోట్ల షేర్ రాబట్టింది. అలాగే కర్ణాటకలో 1.56 కోట్ల షేర్, హిందీ+రెస్టాఫ్ ఇండియా 1 కోటి షేర్, ఓవర్సీస్ లో 2.10 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రత్యేక పాత్రలో నటించినప్పటికీ హిందీలో పెద్దగా కలెక్షన్స్ రాకపోవడం ఆశ్చర్యం. మొత్తానికి 'గాడ్ ఫాదర్' మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.17.68 కోట్ల షేర్(31.10 కోట్ల గ్రాస్)తో సరిపెట్టుకుంది. ఓవరాల్ గా రూ.91 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ చిత్రం హిట్ స్టేటస్ దక్కించుకోవాలంటే బాగా పుంజుకోవాల్సి ఉంది. సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో పాటు, ఈ నాలుగు రోజులు దసరా సెలవులు కావడం 'గాడ్ ఫాదర్'కి కలిసొచ్చే అంశం. మరి ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించి మెగాస్టార్ కి హిట్ ఇస్తుందేమో చూడాలి.
![]() |
![]() |