![]() |
![]() |

'ఆర్ఆర్ఆర్'తో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ గా మారాడు. భీమ్ పాత్రలో అద్భుతంగా నటించి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఉత్తమ నటుడిగా ఆస్కార్ నామినేషన్స్ లో చోటు దక్కించుకునే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో 'ఆర్ఆర్ఆర్'తో ఎన్టీఆర్ తెచ్చుకున్న పేరు పట్ల హీరోయిన్ అమీషా పటేల్ సంతోషం వ్యక్తం చేసింది.

'నరసింహుడు' సినిమాలో తారక్ తో కలిసి అమీషా పటేల్ నటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాలోని ఒక పోస్టర్ ను ట్విట్టర్ లో షేర్ చేసిన అమీషా.. ఇది తాను ఎన్టీఆర్ తో కలిసి నటించిన తెలుగు సినిమాలోని పిక్ అని తెలిపింది. అప్పుడు ఆయన తెలుగులో బిగ్ సూపర్ స్టార్ అని, ఇప్పుడు అతను ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా లెవల్ లో ప్రేమను పొందడం చూసి చాలా సంతోషంగా ఉందని రాసుకొచ్చింది. అతను లవ్లీ కో-స్టార్ అని, కష్టపడేతత్వం, మంచి మనసున్న వ్యక్తి అని కొనియాడింది.

![]() |
![]() |