![]() |
![]() |

వెంకటేష్, ఆసిన్ జంటగా కోలీవుడ్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన సినిమా 'ఘర్షణ'(2004). సూర్య, జ్యోతిక జంటగా గౌతమ్ మీనన్ రూపొందించిన తమిళ్ ఫిల్మ్ 'కాక్క కాక్క'(2003)కి రీమేక్ గా వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదే గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన తొలి తెలుగు సినిమా కావడం విశేషం. అయితే ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ రాబోతోంది.
కోలీవుడ్ స్టార్ శింబు హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'వెందు తనిందదు కాడు'(తెలుగు లో 'లైఫ్ అఫ్ ముత్తు'). ఈ చిత్రం శనివారం తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ముచ్చటిస్తూ ఘర్షణ సీక్వెల్ చేయబోతున్నట్లు గౌతమ్ మీనన్ తెలిపాడు. తెలుగులో తన ఇతర ప్రాజెక్ట్స్ గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
రీసెంట్ గా వెంకటేష్ గారిని కలిసి 'ఘర్షణ-2' గురించి చర్చించానని, ఇంకా స్క్రిప్ట్ అయితే రెడీ కాలేదు కానీ త్వరలోనే తాము ఈ సీక్వెల్ చేస్తామని గౌతమ్ మీనన్ చెప్పాడు. అలాగే తనకు చిరంజీవి గారితో 'వేట్టైయాడు విళయాడు'(తెలుగులో 'రాఘవన్') లాంటి సినిమా చేయాలని ఉందని తెలిపాడు. మరోవైపు 'ఆర్ఆర్ఆర్' ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్యను కూడా ఇటీవల కలిసి ఓ ఫిల్మ్ గురించి డిస్కస్ చేసినట్లు గౌతమ్ మీనన్ చెప్పుకొచ్చాడు.
![]() |
![]() |