![]() |
![]() |

మానస్, విష్ణుప్రియ కలిసి చేసి "జరీ జరీ పట్టు" సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. దీనికి సంబంధించి విష్ణుప్రియ ఒక ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలు షేర్ చేసుకుంది. "హాట్ గా, అందంగా, సెక్సీ గా ఉంటె ఆఫర్స్ ఈజీగా వస్తాయి అంటే నేను ఒప్పుకోను ఎందుకంటే కొంచెం టాలెంట్ ఉండాలి, కొంచెం అదృష్టం కూడా ఉండాలి. అప్పుడు అవకాశాలు వస్తాయి. ఈ జరీ జరీ సాంగ్ కోసం నేను బాగా చేస్తానని శేఖర్ మాస్టర్ నన్ను రిఫర్ చేయడం నిజంగా నా అదృష్టం అని చెప్పొచ్చు. మేల్ డామినేటెడ్ ఉన్న ఏ రంగంలో ఐనా కాస్టింగ్ కౌచ్ అనేది ఉంటుంది. అందుకే ఆడవాళ్లు, మగవాళ్ళు వాళ్ళ వాళ్ళ హార్మోన్స్ ని కంట్రోల్ చేసుకుంటే ఎలాంటి సమస్యలు రావు. బిగ్ బాస్ తెలుగులోకి ఆఫర్ వస్తే చచ్చినా వెళ్ళాను.
అదే హిందీ బిగ్ బాస్ కి ఆఫర్ వస్తే కచ్చితంగా వెళ్తాను ఎందుకంటే కొత్త ఇల్లు కట్టుకోవచ్చు అందుకే. బిగ్ బాస్ ని ఇప్పటివరకు నేను ఫాలో కాలేదు. కానీ ఇప్పుడు నా ఫ్రెండ్ నేహా చౌదరి ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఉంది. ఒకప్పుడు ఈ షో మీద చెడు అభిప్రాయం ఉండేది కానీ ఇప్పుడు అది చాలా వరకు తగ్గింది. ఇక నా ఫస్ట్ కిస్ విషయానికి వస్తే 17 ఏళ్ళ వయసులో కెమెరా ముందు నేను ఫస్ట్ కిస్ ఇచ్చాను. అలాగే నేనో ప్లేయర్ ని . నేను డిస్కస్ త్రో నేషనల్ లెవెల్ వరకు వెళ్ళాను కానీ అమ్మ నేషనల్ లెవెల్ కి పంపకపోయేసరికి నేను పార్టిసిపేట్ చేయలేదు. కానీ డిస్ట్రిక్ట్ లెవెల్ సౌత్ జోన్ నుంచి పార్టిసిపేట్ చేసాను గోల్డ్ మెడల్ విన్ అయ్యాను " అంటూ ఎన్నో విషయాలు చెప్పింది విష్ణు ప్రియా.
![]() |
![]() |