![]() |
![]() |

'బాహుబలి'తో తెలుగు సినిమాకి ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకొచ్చిన దర్శకధీరుడు రాజమౌళి.. 'ఆర్ఆర్ఆర్'తో హాలీవుడ్ స్టార్స్ సైతం తెలుగు సినిమా గురించి మాట్లాడేలా చేశాడు. వరల్డ్ వైడ్ గా ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్' పేరు మారుమోగిపోతోంది. ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల రేసులో సైతం పలు విభాగాల్లో ఆర్ఆర్ఆర్ నిలిచే అవకాశముందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా బెస్ట్ యాక్టర్ విభాగంలో జూనియర్ ఎన్టీఆర్ లేదా రామ్ చరణ్ నామినేట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు.
ప్రముఖ ఇంటర్నేషనల్ మ్యాగజైన్ 'వెరైటీ' ముందు నుంచి ఆస్కార్ రేసులో 'ఆర్ఆర్ఆర్' నిలిచే అవకాశముందని అంచనా వేస్తోంది. ముఖ్యంగా బెస్ట్ యాక్టర్ విభాగంలో జూనియర్ ఎన్టీఆర్ నామినేట్ అయ్యే అవకాశముందని అంచనా వేయడం హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియా అంతా 'ఎన్టీఆర్ ఫర్ ఆస్కార్స్' అంటూ మోతమోగిపోయింది. మరోవైపు ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదన్నట్లుగా పోటాపోటీగా నటించారని, ఆస్కార్స్ రేసులో చరణ్ పేరు ఉండాలన్న డిమాండ్స్ వినిపించాయి. ఈ క్రమంలో తాజాగా వెరైటీ మ్యాగజైన్ రిలీజ్ చేసిన ఆస్కార్స్ ప్రిడిక్షన్ లిస్టులో చరణ్ పేరు కూడా ఉండటం ఆసక్తికరంగా మారింది.

వెరైటీ మ్యాగజైన్ ఆస్కార్స్ ప్రిడిక్షన్ లిస్టులో 35 స్థానంలో ఎన్టీఆర్, 36 స్థానంలో చరణ్ పేర్లు ఉన్నాయి. దీంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఆస్కార్ నామినేషన్స్ ఇద్దరిలో ఎవరి పేరున్నా అది తెలుగు వారికి గర్వకారణమని, తెలుగు సినీ ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే, బెస్ట్ ఒరిజినల్ సాంగ్(దోస్తీ) విభాగాల్లోనూ ఆస్కార్స్ బరిలో ఆర్ఆర్ఆర్ మూవీ నిలిచే ఛాన్స్ ఉందని వెరైటీ సంస్థ అంచనా వేసింది.
వెరైటీ మ్యాగజైన్ అంచనా నిజమై బెస్ట్ యాక్టర్ లేదా మరేదైనా విభాగంలో 'ఆర్ఆర్ఆర్' ఫిల్మ్ నిలిస్తే.. తెలుగు సినిమాకి మాత్రమే కాదు, ఇండియన్ సినిమాకే గర్వకారణం అని చెప్పొచ్చు. ఆ అంచనా నిజమవ్వాలని ఆశిద్దాం.
![]() |
![]() |