Home  »  News  »  తల్లి పాలకు, డబ్బా పాలకు ఉన్నంత తేడా ఉంది

Updated : Sep 16, 2022

టాలీవుడ్ లో టాప్‌ క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో కోట శ్రీనివాసరావు పేరు ముందు వరసలో ఉంటుంది. ఈయన ఎన్నో మూవీస్ లో నటించారు. ఎక్కువగా విల్లన్ రోల్స్ కి పెట్టింది పేరు కోట. బాబూమోహన్, కోట కాంబినేషన్ అంటే అప్పట్లో ఆడియన్స్ ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్లు. సీనియర్ ఎన్టీఆర్‌ దగ్గర నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు ఆయన ఎంతో మందితో  కలిసి నటించారు . ప్రస్తుతం కోట శ్రీనివాసరావు ముసలితనం వచ్చేసరికి  ఆయనకు  అవకాశాలు రావడం లేదు. ఇంట్లో కూర్చుని ఖాళీగా ఏం తోచక ఆయన అవకాశాల కోసం అందరికి ఫోన్స్ చేసి మరి అడుగుతున్నారు. అవకాశం వస్తే మూవీస్ లో నటించడానికి సిద్ధం అని కూడా అంటున్నారు.

"అడగందే అమ్మైనా పెట్టదు అవకాశాల కోసం అడగడంలో ఎలాంటి తప్పూ లేదు" అన్నారు ఒక ఇంటర్వ్యూలో కోట. "కనపడిన ప్రొడ్యూసర్స్ ని అడుగుతూనే ఉంటాను. మహేష్ బాబు , జూనియర్ ఎన్టీఆర్ కనిపించినప్పుడు కూడా మర్చిపోయారా అంటూ అడుగుతాను. వయసు మీదపడినా ఇంట్లో ఖాళీగా కూర్చోవాలంటే  పిచ్చెక్కిపోతోంది. ఎందుకంటే నా జీవితం మొత్తం సినిమాలు చేసి ఇప్పుడిలా కూర్చోవడం అస్సలు నచ్చడం లేదు. అవకాశాలు అడగడంలో ఎంత మాత్రం తప్పు లేదు అని నా అభిప్రాయం. సినిమా ఇండస్ట్రీలో ఎన్నో ఛాలెంజింగ్ రోల్స్ చేసాను. అప్పటి ఇండస్ట్రీకి, ఇప్పటి ఇండస్ట్రీకి చాలా తేడా ఉంది ఎలా అంటే తల్లి పాలకు డబ్బా పాలకు ఉన్నంత తేడా ఉంది. రాజమౌళి లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ రోజున.. ఆయనకు పాన్ ఇండియా లెవెల్లో పేరొచ్చింది. మాయాబజార్ వస్తే ఇప్పటికీ ఇంట్లో అందరూ కలిసి చూస్తారు. కానీ బాహుబలి బాహుబలి అంటూ జపం చేసిన వాళ్ళు ఆ సినిమా వస్తే  చూస్తారా ? అంటూ వ్యంగ్య బాణాలు వేశారు.

"మాయాబజార్ లాంటి సీన్స్ ఇప్పుడు చేయాలంటే ఎన్నో కోట్లు ఖర్చుబెడతారు. ఇప్పుడు గ్రాఫిక్స్ అని కొత్తగా పేరు పెట్టారు కానీ అప్పట్లో ఈ గ్రాఫిక్స్ నే ట్రిక్ ఫోటోగ్రఫీ అనేవాళ్ళు. సినిమా అంటే ఆడియన్స్ నమ్మించాలి, నవ్వించాలి. కానీ ఇప్పుడు అలాంటి సినిమాలు ఏమీ లేవు." అంటూ ఎన్నో విషయాలు చెప్పారు కోట.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.