![]() |
![]() |

తెలుగు రాష్ట్రాల్లో 'బ్రహ్మాస్త్ర' మూవీ అంచనాలకు మించి కలెక్షన్స్ రాబడుతోంది. సెప్టెంబర్ 9న విడుదలైన ఈ చిత్రం డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ రికార్డు స్థాయి ఓపెనింగ్స్ తో సత్తా చాటింది. రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి క్లీన్ హిట్ గా నిలిచింది.
ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో రూ.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన 'బ్రహ్మాస్త్ర' రెండు రోజుల్లోనే రూ.6.30 కోట్ల షేర్ రాబట్టి లాభాల బాట పట్టింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి మొదటి రోజు రూ.3.68 కోట్ల షేర్, రెండో రోజు రూ.2.62 కోట్ల షేర్ తో కేవలం రెండు రోజుల్లోనే రూ.6.30 కోట్ల షేర్(11.75 కోట్ల గ్రాస్)తో తెలుగులో హిట్ గా నిలిచింది. తెలుగు స్టేట్స్ లో ఈ సినిమా ఫుల్ రన్ లో 10 కోట్ల షేర్ కలెక్ట్ చేసినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా నటించిన 'బ్రహ్మాస్త్ర'కు అయాన్ ముఖర్జీ దర్శకుడు. ఇందులో అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్ తో పాటు కీలక పాత్రలో నాగార్జున నటించడం.. సౌత్ లో ఎస్ఎస్ రాజమౌళి సమర్పకులు కావడంతో తెలుగు ప్రేక్షకుల్లో ఈ చిత్రంపై బాగానే ఆసక్తి కలిగింది. ప్రమోషన్స్ కూడా భారీ స్థాయిలో చేశారు. దానికి తోడు చిరంజీవి వాయిస్ ఓవర్, జూనియర్ ఎన్టీఆర్ తో ప్రెస్ మీట్ వంటివి ఈ చిత్రంపై ఇక్కడ బజ్ ఏర్పడేలా చేశాయి. దానికి తగ్గట్టే టాక్ తో సంబంధం లేకుండా మంచి కలెక్షన్స్ వస్తున్నాయి.
![]() |
![]() |