![]() |
![]() |

అనారోగ్యంతో రెబల్ స్టార్ కృష్ణంరాజు(82) కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మరణంతో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయనతో ఉన్న అనుబంధాన్ని, ఆయన మంచి మనసుని గుర్తు చేసుకుంటూ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
కృష్ణంరాజు అనారోగ్యంతో చనిపోయారన్న వార్తలైతే వస్తున్నాయి కానీ అసలు ఆయనను బాధించిన ఆరోగ్య సమస్యలు ఏంటనే విషయం పెద్దగా తెలీదు. అయితే ఆయనకు చికిత్స అందించిన వైద్యులు ఆయన మరణానికి గల కారణాలను వెల్లడించారు.
కృష్ణంరాజు హైదరాబాద్ లోని ఏఐజీ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి గల కారణాలకు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఆయన చాలాకాలంగా మూత్రపిండాలు, ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారట. అలాగే మధుమేహంతో పాటు గుండె కొట్టుకునే వేగంలో సమస్యలు ఉన్నాయట. ఇక పోస్ట్ కోవిడ్ సమస్యలతో ఆయన గత నెలలో ఆస్పత్రిలో చేరగా ఊపిరితిత్తుల్లో న్యూమోనియా ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. అలాగే కిడ్నీ పనితీరు కూడా దెబ్బతినడంతో వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించారు. ఐతే రోజురోజుకి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు. ఈరోజు తెల్లవారుజామున ఆయన గుండెపోటుతో మరణించారు.
![]() |
![]() |