![]() |
![]() |

సుధీర్ బాబు, కృతి శెట్టి జంటగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'. ఈ చిత్రం సెప్టెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్ విడుదలకు ముహూర్తం ఖరారు చేసింది మూవీ టీమ్.
'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' ట్రైలర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా రేపు(సెప్టెంబర్ 5) సాయంత్రం విడుదల చేయనున్నట్లు తెలుపుతూ తాజాగా ఓ పోస్టర్ ని వదిలారు మేకర్స్. పోస్టర్ లో సుధీర్ చేతిలో మెగాఫోన్ పట్టుకొని సోఫాలో కూర్చొని ఉండగా.. కృతి మేకప్ వేసుకుంటూ కనిపిస్తుంది. ఇద్దరి మధ్యలో క్లాప్ బోర్డ్, స్క్రిప్ట్ పేపర్స్ ఉన్నాయి. చూస్తుంటే ఇది దర్శకుడికి, నటికి మధ్య జరిగే కథ అని అర్థమవుతోంది.

బెంచ్ మార్క్ స్టూడియోస్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా వివేక్ సాగర్, సినిమాటోగ్రాఫర్ పీజీ విందా, ఎడిటర్ గా మార్తాండ్ కె వెంకటేష్ వ్యవహరిస్తున్నారు.
![]() |
![]() |