![]() |
![]() |

పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకలు అంటే ఒక క్రేజ్, ఒక ట్రెండ్ సాగుతూ ఉంటుంది. పెద్ద పెద్ద కటౌట్ లు, పాలాభిషేకాలు, వందల కేక్ కటింగ్ లు, వేల అభిమానులు, లక్షల్లో శుభాకాంక్షలు చెబుతారు. పెద్ద హీరోలు, చిన్న హీరోలు కొత్తవాళ్ళు, పాతవాళ్ళు అంటూ తేడా లేకుండా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ప్రతీ ఒక్కరు శుభాకాంక్షలు తెలుపుతారు. అలాంటిది పవన్ కళ్యాణ్ పుట్టిన రోజున అల్లు అర్జున్ నుండి ఒక్క పోస్ట్ గానీ ట్వీట్ గానీ రాలేదు. దీంతో వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఇంకా కొనసాగుతున్నాయా అంటే అవుననే అనిపిస్తోంది.
'దువ్వాడ జగన్నాథం' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున అరవడంతో విసిగిపోయిన అల్లు అర్జున్ "చెప్పను బ్రదర్" అని గట్టిగా అరిచాడు. దాంతో పవన్ అభిమానులు చాలా గట్టిగానే స్పందించారు. 'దువ్వాడ జగన్నాథం' మూవీని నెగెటివ్ టాక్ తో ప్లాప్ చేయించారనే టాక్ ఉంది. ఐతే అప్పటినుండి అల్లు అర్జున్ కి, పవన్ కళ్యాణ్‌కీ మధ్య గొడవలు అలాగే ఉన్నాయని అని, అందుకే శుభాకాంక్షలు తెలుపలేదని తెలుస్తోంది.
దాంతో అన్నయ్య చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి, తమ్ముడు పవన్ కళ్యాణ్ కి శుభాకాంక్షలు చెప్పకపోవడంపై పవన్ కళ్యాణ్ అభిమానులు గరం గరంగా ఉన్నారని తెలుస్తోంది.
![]() |
![]() |