![]() |
![]() |

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలో నటించే అవకాశం అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు చూశారా. ఎలాగైనా రామ్ చరణ్ సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకోవాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారా?. అలాంటి పోస్ట్ లు చూసి ఆవేశపడి, మోసపోకండి. అదంతా తప్పుడు ప్రచారమంటూ తాజాగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ క్లారిటీ ఇచ్చింది.
రామ్ చరణ్ తన 15వ సినిమాని కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై 50వ సినిమాగా తెరకెక్కుతున్న 'RC15'ని భారీ బడ్జెట్ తో దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో నూతన నటీనటులకు అవకాశమంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెడుతూ ఎస్వీసీ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రచారంలో వాస్తవం లేదని, ఆ వార్తలను నమ్మొద్దని తెలిపింది.

కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్, అంజలి, సునీల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
![]() |
![]() |