![]() |
![]() |

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇది బాలయ్య కెరీర్ లో 107వ సినిమా. 'అఖండ' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాలయ్య నటిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ షూటింగ్ కోసం తాజాగా బాలయ్య కర్నూల్ లో అడుగుపెట్టాడు.
'NBK 107' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రేపటి నుంచి కర్నూల్ లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరగనుంది. ఇప్పటికే బాలయ్య కర్నూల్ చేరుకోగా ఆయనకు అభిమానుల నుంచి గ్రాండ్ వెల్ కమ్ లభించింది. కర్నూల్ లోని కొండారెడ్డి బురుజు, మౌర్య హోటల్ సెంటర్ ప్రాంతాలలో రేపటి నుంచి షూటింగ్ జరగనుంది. కొండారెడ్డి బురుజు ఎన్నో సినిమాలకు సెంటిమెంట్ గా నిలిచింది. మరి ఆ సెంటిమెంట్ బాలయ్య సినిమాకి కూడా పని చేస్తుందేమో చూడాలి.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు.
![]() |
![]() |