![]() |
![]() |

ఇనయా సుల్తానా అంటే వెంటనే మనకు గుర్తు రాదు. అదే.. రామ్‌గోపాల్ వర్మతో కలిసి డాన్స్ చేసి వార్తల్లోకి ఎక్కిన అమ్మాయి అంటే గుర్తుకొస్తుంది. 'ఏవమ్ జగత్' సినిమాలో హీరోయిన్‌గానూ ఆమె ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆర్జీవీతో చేసిన డాన్స్ ఆమెను ఎలా పాపులర్ చేసిందో, తన కుటుంబానికి అంత దూరం చేసింది. ఆయనతో ఆ చిందులేమిటని ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు ఆమెను తిట్టని తిట్లు లేవు. ఈ విషయాన్ని తాజాగా షేర్ చేసుకొని, భావోద్వేగానికి లోనైంది ఇనయ.
ఆమె ఇండస్ట్రీకి వచ్చినప్పుడు తల్లితండ్రుల సపోర్ట్ లేదు. అంతకు ముందు ఉద్యోగం చేస్తానన్నా వాళ్లు ఒప్పుకోలేదు. పాండమిక్ టైమ్‌లో ఆమె తండ్రిని కోల్పోయింది. ఇంట్లోంచి వంద రూపాయలు తీసుకొని బయటకు వచ్చేసింది. "సినిమాల్లో నటించాలని ట్రై చేస్తుండగా, ఆర్జీవీ పరిచమయ్యారు. నా బర్త్‌డేకి పిలిస్తే వచ్చారు. ఆయనకు నచ్చిన పాటలు ప్లే చేశారు. ఆయనతో డ్యాన్స్ చేశాను. అందులో ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోతో నా ఇంట్లోవాళ్లు, బంధువులు, స్నేహితులు అందరూ అసహ్యించుకున్నారు. అందరూ నన్ను తప్పుగా చూస్తున్నారు. నేను పోర్న్ వీడియోలు చేయట్లేదు కదా, నేను ఇండస్ట్రీకి వచ్చి సినిమాలే చేస్తున్నా కదా, అయినా సరే వాళ్లకు నేను నచ్చలేదు. మా నాన్న సినిమాల్లోకి వెళ్దామనుకున్నప్పుడు కుటుంబ సమస్యలతో వెనకడుగు వేశాడు. ఆయన ఉండుంటే కచ్చితంగా నన్ను సపోర్ట్ చేసేవాడు." అని ఆవేదనగా చెప్పిందామె.
ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందనీ, దాని వల్ల ఎన్నో ఆఫర్స్ వదులుకున్నాననీ ఆమె వెల్లడించింది. "అవి మిస్ అవకపోయుంటే ఈపాటికి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్‌లో ఉండేదాన్నేమో! కానీ ప్రస్తుతం నాకు వస్తున్న పాత్రలతో సంతోషంగా ఉన్నాను. ప్రస్తుతం 'యద్భావం తద్భవతి', 'నటరత్నాలు' సహా మరో మూడు సినిమాలు చేస్తున్నాను" అని చెప్పింది ఇనయ.

![]() |
![]() |