![]() |
![]() |
.webp)
సుదీర్ఘ కాలంగా డేటింగ్‌లో ఉన్న నయనతార, విఘ్నేశ్ శివన్ జూన్ 9న పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వారి పెళ్లి వేడుకను స్ట్రీమింగ్ చేయడానికి ఓటీటీ ప్లాట్‌పామ్ నెట్‌ఫ్లిక్స్ ముందుకు వచ్చింది. పెళ్లి వేడుకకు ముందుగానే ఏకంగా రూ. 25 కోట్లకు నయన్-విఘ్నేశ్‌తో నెట్‌ఫ్లిక్స్ డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. అయితే లేటెస్ట్‌గా ఆ డీల్‌ను ఓటీటీ దిగ్గజం రద్దు చేసుకుందని వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం, ఇటీవల తన ఇన్‌స్టా హ్యాండిల్ ద్వారా విఘ్నేశ్ శివన్ షేర్ చేసిన ఫొటోలే అంటున్నారు. ఇప్పటిదాకా బయటకు రాని కొన్ని ఫొటోలను విఘ్నేశ్ షేర్ చేయడంతో, నెట్‌ఫ్లిక్స్ షాకయ్యింది. స్ట్రీమింగ్ కోసం కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన వేడుకకు సంబంధించిన ఫొటోలు ఎలా బయట పెడతారనేది ఆ సంస్థ నుంచి వచ్చిన ప్రశ్న. విఘ్నేశ్ చేసిన పనితో డీల్‌ను కేన్సిల్ చేసుకుందంట నెట్‌ప్లిక్స్.
పెళ్లిచేసుకొని ఒక నెల పూర్తయిన సందర్భంగా, ఆ వేడుకకు సంబంధించిన కొన్ని ఫొటోలను ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశాడు విఘ్నేశ్. వాటిలో రజనీకాంత్, షారుక్ ఖాన్, మణిరత్నం, సూర్య, విజయ్ సేతుపతి, ఎ.ఆర్. రెహమాన్ లాంటి పేరుపొందిన సెలబ్రిటీలు కనిపిస్తున్న ఫొటోలున్నాయి. ఎక్కువ కాలం ఆ ఫొటోలను బయట పెట్టకుండా ఉండటం కరెక్ట్ కాదని విఘ్నేశ్ భావించాడటం. అవి రావడం మరింత ఆలస్యమైతే, తమ పెళ్లికి సంబంధించిన క్రేజ్ తగ్గిపోతుందనీ, ఆ తర్వాత బయటకు వచ్చినా ఫ్యాన్స్ వాటిపై ఇంటరెస్ట్ చూపించరనీ అనుకున్నాడంట.
వస్తున్న రిపోర్టులు నిజమే అయితే, తమ డీల్‌లో భాగంగా నయన్-విఘ్నేశ్ పెళ్లి వేడుకకు సంబంధించిన ఖర్చులన్నింటినీ నెట్‌ఫ్లిక్స్ భరించిందంట. మహాబలిపురంలో ఫైవ్ స్టార్ రేటింగ్ ఉన్న రిసార్ట్‌లో రూమ్స్ బుక్ చేయడం దగ్గర్నుంచీ, బీచ్‌లో ఒక గ్లాస్ ప్యాలెస్‌ను నిర్మించడం, భోజన సదుపాయాలు కల్పించడం, ఖరీదైన మేకప్ ఆర్టిస్టులను, సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేయడం సహా అన్ని ఖర్చులను నెట్‌ఫ్లిక్స్ భరించింది. వేడుకలో భాగంగా తమిళనాడు వ్యాప్తంగా లక్ష మందికి పైగా అభిమానులకు భోజనాలు ఏర్పాటుచేశారు కొత్త దంపతులు. అలాగే వృద్ధాశ్రమాల్లోనూ, దేవాలయాల్లోనూ అన్నదానాలు నిర్వహించారు.
![]() |
![]() |