![]() |
![]() |

షణ్ముఖ్ జస్వంత్ స్వీడు పెంచేశాడు. యూట్యూబ్ స్టార్ కాస్తా ఓటీటీ స్టార్ గా మారిపోయాడు. షణ్ముఖ్ నటించిన తాజా వెబ్ సిరీస్ 'ఏజెంట్ ఆనంద్ సంతోష్'. 100 పర్సెంట్ ఎంటర్ టైన్ మెంట్ అంటూ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ ఆహా ఓటీటీలోకి వచ్చేస్తున్నాడు. `సప్తగిరి ఎక్స్ ప్రెస్` ఫేమ్ అరుణ్ పవార్ రూపొందించిన ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన ప్రోమోని శుక్రవారం విడుదల చేశారు. ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంటోంది. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ముక్కుపుడక పిల్ల అలంక్రిత షా.
ఇందులో షణ్ముఖ్ జస్వంత్ కు జోడీగా నటించింది. పద్దతైన అమ్మాయిగా కనిపించింది. అయితే ఈ వెబ్ డ్రామాలో తనకు అవకాశాన్ని మాత్రం అందించింది తన ముక్కుపుడకే అంటోంది. తాను పెట్టుకున్న ముక్కుపుడక వల్లే `ఏజెంట్ ఆనంద్ సంతోష్` లో నటించే అవకాశం తనకు లభించిందని చెబుతోంది. నా ముక్కుపుడక చూడగానే షన్నుకూ బాగా నచ్చేసింది. అదే నా ప్లస్ పాయింట్. క్యారెక్టర్ ప్రకారం పద్దతిగా వుండే అమ్మాయి కావాలి. అలా నా ముక్కు పుడకని చూసి ఇందులో నాకు అవకాశం ఇచ్చారని చెబుతోంది.

ఇప్పటికీ షణ్ముఖ్ జస్వంత్.. ఫస్ట్ నీ ముక్కుపుడక చూసే ఆఫర్ ఇచ్చానని అంటుంటాడు. ఆ తరువాతే ఆడిషన్స్ చేశామని, ఫైనల్ గా ఎంపిక చేశామని చెబుతున్నాడు. అలా అనడంతో ముందు నేను అలిగాను. ఎవరైనా స్కిల్ చూసి అవకాశం ఇస్తారు. కానీ ముక్కుపుడకని చూసి అవకాశం ఇచ్చామని చెప్పడం కొంత నన్ను ఇబ్బందికి గురిచేసింది. ఏదైతేనేం మొత్తానికి తొలి వెబ్ సిరీస్ లో నటించే అవకాశం లభించింది అని చెప్పుకొచ్చింది అలంక్రిత షా. `ఏజెంట్ ఆనంద్ సంతోష్` జూలై 22 నుంచి `ఆహా`లో స్ట్రీమింగ్ కాబోతోంది.
![]() |
![]() |