![]() |
![]() |

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'రామారావు ఆన్ డ్యూటీ' జూలై 29న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమౌతోంది. నూతన దర్శకుడు శరత్ మండవ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూలై 29న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ తాజాగా హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి 'రామారావు ఆన్ డ్యూటీ' ట్రైలర్ ని విడుదల చేశారు. ఈ వేడుకలో రవితేజ, నిర్మాత సుధాకర్ చెరుకూరి, దర్శకుడు శరత్ మండవ, దివ్యాంశ కౌశిక్, నాజర్, సుదీర్ వర్మ, త్రినాథ రావ్ నక్కిన , వంశీ, కళ్యాణ్ చక్రవర్తి, సాహి సురేష్ తదితరులు పాల్గొన్నారు.
''ఇన్నాళ్ళు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ గా చట్టప్రకారం న్యాయం కోసం డ్యూటీ చేసిన నేను..ఇక పై రామారావు గా ధర్మం కోసం డ్యూటీ చేస్తాను'' అని మాస్ మహారాజా రవితేజ చెప్పిన డైలాగ్ తో మొదలై ట్రైలర్.. ఆద్యంతం యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో బ్రిలియంట్ గా సాగింది. ట్రైలర్ బిగినింగ్ లో ఒక ఆపరేషన్ లో వేర్వేరు ప్రాంతాలకు చెందిన కష్టజీవులు మాయమయ్యారని చెప్పడం.. ''మా నాన్నని వెదకడానికి హెల్ప్ చేస్తారా ?'' అని ఓ పాప ప్రాధేయపడగా... రామారావు గా రవితేజ ఎంట్రీ మెస్మరైజింగా అనిపించింది. ఒక ప్రాంతంలోని వ్యక్తులు ఎందుకు మిస్ అవుతున్నారు? ఆ ఆపరేషన్ వెనుక ఉన్నదెవరు? ఈ మిస్టరీని రామారావు ఎలా చేధిస్తాడనేది ట్రైలర్ లో చాలా గ్రిప్పింగా చూపించారు.

ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో రవితేజ మాట్లాడుతూ.. "దర్శకుడు శరత్ అద్భుతమైన సినిమా తీశారు. ట్రైలర్ మీ అందరికీ నచ్చింది కదా.. నాకైతే చాలా నచ్చేసింది. సత్యన్ సూర్యన్, సామ్ సిఎస్ మిగతా టెక్నిషియన్లు అద్భుతంగా పని చేశారు. దివ్యాంశ కౌశిక్ అందంగా వుంది. ట్రైలర్ ఈవెంట్ కి వచ్చిన అనిల్ రావిపూడి మిగతా గెస్ట్ లకు థాంక్స్.'' అన్నారు
దర్శకుడు శరత్ మండవ మాట్లాడుతూ.. "తెలుగు చిత్ర పరిశ్రమలో రవితేజ గారు వుండటం ఒక పెద్ద అదృష్టంగా భావిస్తున్నా. నాలాంటి వారిని చాలా మందిని ఆయన పరిచయం చేశారు. కొత్త ఆలోచనలు వినడానికి ఎప్పుడూ సిద్దంగా వుంటారు. నా టీం అందరికీ కృతజ్ఞతలు. మీ అందరికీ ట్రైలర్ నచ్చడం ఆనందంగా వుంది. 29 న అందరూ థియేటర్ కి రండి. 'రామారావు ఆన్ డ్యూటీ' మిమ్మల్ని అన్ని రకాలుగా అలరిస్తుంది'' అన్నారు.
అనిల్ రావిపూడి మాట్లాడుతూ..రవితేజ మాస్ మహారాజా మాత్రమే కాదు మంచి మనసున్న మహారాజా. చాలా మంది దర్శకులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్ దర్శకులని చేశారు. 'రామారావు ఆన్ డ్యూటీ' టీజర్, సాంగ్స్ అన్నీ అద్భుతంగా వున్నాయి. ఇప్పుడు ట్రైలర్ కూడా ఎక్స్ టార్డినరీగా వుంది. దర్శకుడు శరత్ అద్భుతంగా తీశారని ట్రైలర్ చూస్తే అర్ధమౌతుంది. నిర్మాతలకు, నటీనటులకు అందరికీ ఆల్ ది బెస్ట్.''అన్నారు.
దివ్యాంశ కౌశిక్ మాట్లాడుతూ.. "రామారావు ఆన్ డ్యూటీ చిత్రంలో భాగం కావడం ఆనందంగా వుంది. సినిమా అద్భుతంగా వచ్చింది. 29 న థియేటర్ కి వస్తోంది. మీరంతా థియేటర్ లో చూడాలి'' అని కోరారు.
![]() |
![]() |