![]() |
![]() |

ఇటీవల 'సమ్మతమే' సినిమాతో ప్రేక్షకులను పలకరించిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం త్వరలో మరో సినిమాతో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. అదే 'వినరో భాగ్యము విష్ణు కథ'. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మురళి కిషోర్ అబ్బూరు దర్శకుడు. ఈ మూవీ నుంచి గ్లింప్స్ విడుదలైంది.
రేపు(జులై 15న) కిరణ్ అబ్బవరం పుట్టినరోజు కావడంతో తాజాగా మేకర్స్ 'వినరో భాగ్యము విష్ణు కథ' గ్లింప్స్ రిలీజ్ చేశారు. "ఏడు వింతలు గురించి మాకు పెద్దగా తెలీదు.. మా జీవితాలన్నీ ఏడు కొండల చుట్టూ తిరుగుతూ ఉంటాయి" అంటూ కిరణ్ వాయిస్ తో ప్రారంభమైన గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. "మాది తిరుపతి.. నా పేరు విష్ణు..ఇంకొన్ని రోజుల్లో మీరంతా చూడబోయేదే నా కథ" అంటూ గ్లింప్స్ ఆసక్తికరంగా సాగింది. చివరిలో లుంగీ కట్టుకొని మాస్ లుక్ లో కనిపించాడు కిరణ్. సాఫ్ట్ గా, సరదాగా ఉండే హీరో అలా వైలెన్స్ లోకి ఎందుకో దిగాడో తెలియాలంటే విష్ణు కథ తెలుసుకోవాల్సిందే.

'వినరో భాగ్యము విష్ణు కథ'లో కశ్మీర హీరోయిన్ గా నటిస్తోంది. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా డేనియల్ విశ్వాస్, ఎడిటర్ గా మార్తాండ్ కె.వెంకటేష్ వ్యవహరిస్తున్నారు.
![]() |
![]() |