![]() |
![]() |

బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ హీరోగా నటించిన తాజా చిత్రం 'లాల్ సింగ్ చడ్ఢా'. ఈ సినిమాలో కథానాయికగా బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్, ఓ ప్రత్యేక పాత్రలో అక్కినేని వారసుడు నాగ చైతన్య నటించారు. అద్వైత్ చందన్ దర్శకత్వంలో అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ మరియు వయాకామ్ 18 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన 'లాల్ సింగ్ చడ్ఢా' ఆగస్ట్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది.
ఆమిర్ ఖాన్, మెగా స్టార్ చిరంజీవి మధ్య స్నేహం చాలా ఏళ్లనాటిది. వారిద్దరిది పరస్పర గౌరవపూర్వకమైనబంధం. తాజాగా అమీర్ ఖాన్ తన ప్రియమిత్రుడు చిరంజీవి మరియు టాలీవుడ్ ప్రముఖుల కోసం తన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అయిన 'లాల్ సింగ్ చడ్ఢా' ప్రత్యేక ప్రివ్యూను హైదారాబాద్ లో నిర్వహించారు.

ఈ వారం మొదట్లో హైదరాబాద్‌లోని మెగాస్టార్ చిరంజీవి నివాసంలో ఈ సినిమా ప్రత్యేక ప్రివ్యూ జరిగింది. ఈ ప్రివ్యూకి ప్రత్యేక అతిధులుగా కింగ్ నాగార్జున, అక్కినేని నాగ చైతన్య, స్టార్ డైరెక్టర్లు ఎస్ఎస్.రాజమౌళి, సుకుమార్ పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని చూశాక వారంతా ప్రశంసించినట్లు తెలుస్తోంది.
![]() |
![]() |