![]() |
![]() |

`అన్నయ్య` (2000) చిత్రంలో అన్నదమ్ములుగా కలిసి నటించారు మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ. కట్ చేస్తే.. 22 ఏళ్ళ సుదీర్ఘ విరామం అనంతరం `మెగా 154`(వర్కింగ్ టైటిల్)లోనూ అదే బంధంతో కనిపించనున్నారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. `పవర్`, `జై లవ కుశ`, `వెంకిమామ` చిత్రాల దర్శకుడు బాబీ రూపొందిస్తున్న ఈ సినిమా.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. కాగా, తాజాగా ఈ సినిమా షూటింగ్ లో రవితేజ జాయిన్ అయ్యారని సమాచారం.
ఇదిలా ఉంటే, `మెగా 154`ని సంక్రాంతి స్పెషల్ గా రిలీజ్ చేయబోతున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. చిరు, రవితేజ అన్నదమ్ములుగా నటించిన `అన్నయ్య` కూడా గతంలో ఇదే సీజన్ లో విడుదలై మంచి విజయం సాధించింది. మరి.. `అన్నయ్య`లాగే `మెగా 154` కూడా సంక్రాంతి హిట్ గా నిలుస్తుందేమో చూడాలి. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న `మెగా 154`లో చిరుకి జంటగా శ్రుతి హాసన్ నటిస్తుండగా.. రవితేజకి జోడీగా కేథరిన్ ట్రెసా సందడి చేయనుందని బజ్. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నారు.
![]() |
![]() |