![]() |
![]() |

దర్శకరత్న దాసరి నారాయణ రావు పలు జనరంజక ఫ్యామిలీ డ్రామాలను తెరకెక్కించారు. వాటిలో `నా మొగుడు నాకే సొంతం` ఒకటి. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, సహజనటి జయసుధ జంటగా నటించిన ఈ సినిమాలో వాణీ విశ్వనాథ్ మరో నాయికగా అలరించగా.. దాసరి నారాయణ రావు, గొల్లపూడి మారుతీరావు, కోట శ్రీనివాసరావు, చరణ్ రాజ్, గిరిబాబు, సుధాకర్, శ్రీహరి, రమాప్రభ, వరలక్ష్మి, డబ్బింగ్ జానకి, రోహిణి, జయశీల, బేబి లక్ష్మీ ప్రసన్న, మాస్టర్ విష్ణు, మాస్టర్ మనోజ్, బేబి హేమాలయ కుమారి ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. కలైమణి కథను అందించగా.. దాసరి నారాయణ రావు కథనం, సంభాషణలు, సాహిత్యం సమకూర్చారు. తమిళ చిత్రం `ఎన్ పురుషన్ దాన్ ఎనక్కు మట్టుముదాన్` (1989) ఆధారంగా ఈ సినిమాని రీమేక్ చేశారు దాసరి.
స్వరబ్రహ్మ కేవీ మహదేవన్ బాణీలు అందించిన ఈ చిత్రంలో ``లేఖ ఇది ఒక లేఖ``, ``గాలి ప్రేమ గాలి``, ``బెజవాడ కొండెక్కి`` అంటూ మొదలయ్యే పాటలు ఆకట్టుకున్నాయి. మోహన్ బాబు స్వయంగా నిర్మించిన `నా మొగుడు నాకే సొంతం`.. 1989 జూలై 14న విడుదలైంది. కాగా, నేటితో ఈ చిత్రం 33 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |