![]() |
![]() |

మారుతి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా అంటూ కొంతకాలంగా వార్తలొస్తున్నాయి. ఇప్పటిదాకా అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ వీరి కాంబినేషన్ లో సినిమా గురించి ఇప్పటికే హింట్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాని ప్రభాస్ పక్కన పెట్టేస్తాడా అనే చర్చ మొదలైంది.
'బాహుబలి' ఫ్రాంచైజ్ తర్వాత ఊహించని విధంగా సుజిత్ తో 'సాహో', రాధాకృష్ణ కుమార్ తో 'రాధేశ్యామ్' చేసి రిస్క్ చేసిన ప్రభాస్ పరాజయాలను మూటగట్టుకున్నాడు. ప్రభాస్ తో సినిమా చేయడానికి ఎందరో స్టార్ డైరెక్టర్స్ ఎదురుచూస్తుంటే.. ఆయన మాత్రం కుర్ర దర్శకులతో సినిమాలు చేసి చేతులు కాల్చుకుంటున్నాడు అంటూ ఫ్యాన్స్ నిరాశ చెందారు. అయితే ప్రస్తుతం 'ఆదిపురుష్', 'సలార్', 'ప్రాజెక్ట్ k' వంటి భారీ ప్రాజెక్ట్స్ చేస్తుండటంతో ప్రభాస్ ఫ్యాన్స్ కాన్ఫిడెంట్ గా, హ్యాపీగా ఉన్నారు. కానీ మారుతి ప్రాజెక్టే కాస్త వారిని కలవరపెడుతోంది. భారీ ప్రాజెక్ట్స్ నడుమ మారుతి సినిమా అవసరమా అంటూ వారు ఆందోళన చెందుతున్నారు. ఇక ఇప్పుడు 'పక్కా కమర్షియల్' కి వస్తున్న టాక్ తో మారుతి సినిమాని పక్కన పెట్టాలంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేస్తున్నారు.
పెద్ద హీరోలతో మారుతి పెద్దగా సినిమాలు చేసింది లేదు. వెంకటేష్ తో చేసిన 'బాబు బంగారం' నిరాశపరిచింది. యంగ్ హీరోలతోనే ఎక్కువగా వర్క్ చేసిన మారుతి 'భలే భలే మగాడివోయ్', 'ప్రతిరోజూ పండగే' వంటి విజయాలను అందుకున్నాడు. ఇక ఇప్పుడు తాజాగా 'పక్కా కమర్షియల్' తో ప్రేక్షకులను పలకరించాడు. గోపీచంద్ హీరోగా నటించిన ఈ సినిమా నెగటివ్ టాక్ తెచ్చుకుంది. బలంలేని కథా కథనాలు, నవ్వురాని సన్నివేశాలతో సినిమాని చుట్టేశాడంటూ విమర్శలు వస్తున్నాయి. యంగ్ హీరోలతో అంతో ఇంతో ఎంటర్టైన్ చేసే మారుతి.. స్టార్స్, మాస్ హీరోల విషయాన్ని వచ్చేసరికి చేతులెత్తేస్తున్నాడు. మరి 'పక్కా కమర్షియల్'కి వస్తున్న రెస్పాన్స్ మరియు ఫ్యాన్స్ నుండి వస్తున్న డిమాండ్స్ తో ప్రభాస్ మారుతి సినిమాని పక్కన పెడతాడో లేక ఇలాంటి లెక్కలు పట్టించుకోకుండా పట్టాలెక్కిస్తాడో చూడాలి.
![]() |
![]() |