![]() |
![]() |
.webp)
జయాపజయాలతో సంబంధం లేకుండా విభిన్న చిత్రాలతో అలరించే యంగ్ హీరో శ్రీ విష్ణు 'అల్లూరి' అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తున్న ఈ సినిమాకి ప్రదీప్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ విడుదలైంది.
'అల్లూరి' సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు శ్రీ విష్ణు. ఫస్ట్ లుక్ లో పోలీస్ యూనిఫామ్ ధరించి చేతిలో గన్ పట్టుకొని కోర మీసాలతో ఉన్న విష్ణు లుక్ ఆకట్టుకుంటుంది. యూనిఫామ్ కి ఉన్న నేమ్ ప్లేట్ పై ఏ.ఎస్.రామరాజు అని రాసి ఉండటం చూస్తుంటే.. ఈ మూవీలో విష్ణు పాత్ర పేరు అల్లూరి సీతారామరాజు అని తెలుస్తోంది. అలాగే పోస్టర్ లో 'నిజాయితీకి మారుపేరు' ఉండటం బట్టి ఇదొక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ స్టొరీ అని అర్థమవుతోంది. తన గత చిత్రాలు 'అర్జున ఫల్గుణ', 'భళా తందనాన'తో ఆశించినస్థాయిలో అలరించలేకపోయిన శ్రీవిష్ణు 'అల్లూరి'తో పూర్తిస్థాయిలో అలరిస్తాడేమో చూడాలి.

ఈ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం సమకూరుస్తుండగా.. రాజ్ తోట సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.
![]() |
![]() |