![]() |
![]() |

తెలుగు సినిమాలకి ఇంగ్లిష్ టైటిల్స్ పెట్టడమన్నది చాన్నాళ్ళుగా ఉన్న వ్యవహారమే. అయితే, గత కొంతకాలంగా అది కాస్త ట్రెండ్ గా మారిపోయింది. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న చాలా తెలుగు సినిమాలు ఆంగ్ల శీర్షికలతోనే రూపొందుతున్నాయి. మరీముఖ్యంగా.. జూలై నెలలో తెరపైకి వస్తున్న సినిమాల్లో అయితే ప్రతీ వారం ఇంగ్లిష్ టైటిల్ సందడి కనిపిస్తుండడం ఆసక్తి రేకెత్తిస్తోంది.
ఆ వివరాల్లోకి వెళితే.. ఈ వారం అంటే జూలై 1న `పక్కా కమర్షియల్`, `టెన్త్ క్లాస్ డైరీస్` వంటి ఇంగ్లిష్ టైటిల్స్ ఉన్న టాలీవుడ్ ప్రాజెక్ట్స్ తెరపైకి రాగా.. వచ్చే వారం అంటే జూలై 8న `హ్యాపీ బర్త్ డే` ఎంటర్టైన్ చేయనుంది. ఆపై వారంలో అంటే జూలై 14న `ది వారియర్` రాబోతుండగా.. జూలై 22న `థాంక్ యూ` అనే మరో ఆంగ్ల శీర్షిక సంబంధిత చిత్రం పలకరించబోతోంది. అదే విధంగా.. జూలై చివరి వారంలో కూడా `రామారావు ఆన్ డ్యూటీ`, `హిట్ః ది సెకండ్ కేస్` అంటూ ఈ తరహా టైటిల్స్ ఉన్న మూవీస్ వినోదాలు పంచనున్నాయి. మరి.. వీటిలో ఏయే చిత్రాలకు ప్రజాదరణ దక్కుతుందో తెలియాంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే.
![]() |
![]() |