మెగా ఫ్యామిలీతో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కి మంచి అనుబంధమున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్ర పోషిస్తున్న 'గాడ్ ఫాదర్' సినిమాలో సల్మాన్ కీ రోల్ పోషిస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంట్లో సల్మాన్ ఖాన్ సందడి చేశాడు. సల్మాన్ తో పాటు విక్టరీ వెంకటేష్, పూజా హెగ్డే కూడా ఉన్నారు.
సల్మాన్ ప్రస్తుతం 'కబీ ఈద్ కబీ దివాలీ' అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ క్రమంలో తాజాగా ఈ ముగ్గురు స్టార్స్ చరణ్ ఇంట్లో సందడి చేశారు. చరణ్, ఉపాసనతో కలిసి వీరు దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
కాగా, 'కబీ ఈద్ కబీ దివాలీ' మూవీలో చరణ్ గెస్ట్ రోల్ లో కనిపించనున్నాడని, ఓ సాంగ్ లో సల్మాన్ తో కలిసి చిందేయనున్నాడని టాక్.