![]() |
![]() |

ఎన్నో సినిమాలలో నటించి తమిళ్ తో పాటు తెలుగులోనూ యాక్షన్ కింగ్ గా గుర్తింపు తెచ్చుకున్న అర్జున్.. దర్శకుడిగానూ పలు సినిమాలు తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ తో ఓ సినిమా తెరకెక్కించనున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది.

'ఈ నగరానికి ఏమైంది', 'ఫలక్ నుమా దాస్', 'హిట్' వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్.. ఇటీవల 'అశోకవనంలో అర్జున కళ్యాణం' సినిమాతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో చేతిలో 'గామి', 'ఓరి దేవుడా', 'దాస్ కా ధమ్కీ' వంటి సినిమాలు ఉండగా.. తాజాగా మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

అర్జున్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ సినిమా చేయనున్నట్లు కొంతకాలంగా వార్తలొస్తున్నాయి. ఆ వార్తలను నిజం చేస్తూ రీసెంట్ గా అఫీసియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. ఈ సినిమాకి రచన, దర్శకత్వంతో పాటు నిర్మాతగానూ అర్జున్ వ్యవహరిస్తుండటం విశేషం. శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమాతో అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ టాలీవుడ్ కి పరిచయం కానుంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా రూపొందనుంది.
![]() |
![]() |