![]() |
![]() |

విశ్వక్సేన్, రుక్సానా హీరో, హీరోయిన్స్ గా నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం ఈరోజు నుంచి ఆహా ప్లాట్ ఫారం పై స్ట్రీమ్ కాబోతోంది. యంగ్ హీరో విశ్వక్ నటన గురుంచి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే పాగల్ మూవీలో ఎంత టైమింగ్ ఉన్న కామెడీ ప్లస్ నటన పంచాడో అందరికీ తెలుసు. అదే రేంజ్ లో వరుస మూవీస్ తో దూసుకెళుతున్నాడు. పెద్ద సినిమాలన్నీ ఒకేసారి థియేటర్స్ కి వచ్చేసరికి ఈ మూవీ స్టోరీ లైన్ బాగున్నా పెద్దగా కలెక్షన్స్ అందుకోలేకపోయింది ఈ మూవీ.
పెళ్లి కోసం ఎదురు చూసే వ్యక్తిగా విశ్వక్ నటన బాగుందని టాక్. ఈ మూవీ కోసం రాముడు మంచి బాలుడు టైపులో విశ్వక్ డ్రెస్సింగ్ స్టైల్ ఉంటుంది. ఇప్పటివరకు బబ్లీగా, క్రేజీగా కనిపించి ఒక్కసారిగా పద్దతిగా ఉన్న క్యారెక్టర్ చేసేసరికి విశ్వక్ ఎలాంటి పాత్రలో ఐనా యిట్టె ఒదిగిపోతాడు అనే మర్క్స్ వేయించుకున్నాడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా గాడ్ ఫాథర్స్ లేకుండా టాలీవుడ్ లో తనకంటూ ఒక సొంత గుర్తింపు తెచ్చుకున్న హీరోస్ లో ఇతను ఒకడు. రఫ్ అండ్ టఫ్ రోల్స్ లో యాక్ట్ చేసేయడం చాలా సులువు. కానీ డిఫరెంట్ రోల్ లో కొంచెం ఒదిగి పాత్ర ఎంత డిమాండ్ చేస్తే అంత మాత్రమే చేయడం అనేది చాలా కష్టం. అలాంటి ఈ పాత్రలో విశ్వక్ మెట్యూరిటీ కనిపిస్తుంది.. ఇక ఈ మూవీ టోటల్ గా ఎలా ఉంటుంది అనే విషయం ఈరోజు స్ట్రీమ్ కాబోయే ఈ మూవీలో చూడొచ్చు.
![]() |
![]() |