![]() |
![]() |

ప్రభాస్ అనే పేరులో ఏదో మత్తు ఉందని లేడీ ఫాన్స్ ఫీలవుతూ ఉంటారు. బాహుబలి మూవీలో పాత్ర డిమాండ్ మేరకు చాలా బరువు పెరిగాడు. ఐతే తర్వాత అదే బరువుతో రాధే శ్యామ్ లో కూడా కనిపించేసరికి అభిమానులు కాస్త నిరుత్సాహపడ్డారు. బరువు ఎక్కువగా ఉంటే యాక్షన్ లెవెల్లో చాలా చేంజెస్ వస్తాయి. ఎంత మేకప్ వేసిన ఫేస్ చాలా డల్ గా కనిపిస్తుంది. యాక్టింగ్ చేసినా ఆ జోష్ అనేది కనిపించదు. బాహుబలి మూవీ దాని సీక్వెల్, సాహో మూవీస్ కి బరువు పెరగడం, తగ్గడం జరిగింది. ఐతే ఐదేళ్ల క్రితం ఒక మూవీ షూటింగ్ లో మోకాలికి గాయమై అది మళ్ళీ తిరగబెట్టేసరికి విదేశాలకు వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుని వచ్చాడు.
ఐతే ఈ గ్యాప్ లో చాలా బరువు పెరిపోవడంతో సలార్ మూవీ కోసం కచ్చితంగా బరువు తగ్గాలని చెప్పేసరికి ఇప్పుడు ఆ పనిలో పడ్డాడు ప్రభాస్. బాడీని ఫిట్ గా ఉంచుకోకపోతే ఫ్యూచర్ లో మూవీ ఆఫర్స్ రావడం తగ్గిపోతాయి అని సూచించడంతో కష్టమైన కసరత్తులు చేస్తూ సన్నబడే పనిలో పడ్డాడు. ప్రభాస్ వర్కౌట్స్ అంటే పెద్దగా ఇష్టపడడు. కానీ ఈ మూవీ కోసం కష్టమైనా సరే కష్టపడుతూ స్లిమ్ అవడానికి ట్రై చేస్తున్నాడు. కొన్ని కిలోల బరువు తగ్గితే మాత్రం సలార్ మూవీలో ప్రభాస్ మంచి స్టన్నింగ్ పర్సనాలిటీతో కనిపిస్తాడని మళ్ళీ ఆనాటి డార్లింగ్ ప్రభాస్ ని గుర్తుచేస్తాడని ప్రశాంత్ నీల్ అంటున్నాడు. ప్రభాస్ మళ్ళీ మునుపటిలా సన్నబడతాడా లేదా అనేది వేచి చూడాలి.
![]() |
![]() |