![]() |
![]() |

టాలీవుడ్ నుంచి మరో పాన్ ఇండియా మూవీ వస్తోంది. అదే 'మేజర్'. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో టాలెంటెడ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్ ఆకట్టుకుంది. జూన్ 3 న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ట్రైలర్ ను ఈ నెల 9 న విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో మూవీ టీమ్ తాజాగా భారత రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిసి ట్రైలర్ చూపించడం విశేషం.
26/11 ముంబై తీవ్రవాద దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా 'మేజర్' రూపొందుతోంది. సైనికుల త్యాగాన్ని, దేశ భక్తిని చాటి చెప్పేలా ఈ సినిమా ఉండనుంది. ఇదిలా ఉంటే తాజాగా డైరెక్టర్ శశి కిరణ్ తో కలిసి వెళ్లి రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిశాడు అడివి శేష్. ఈ సందర్భంగా రాజ్ నాథ్ సింగ్ కు ట్రైలర్ చూపించగా ఆయన ప్రశంసించినట్లు తెలుస్తోంది. అలాగే ఆయన చేతుల మీదుగా మేజర్ ప్రామిస్ పోస్టర్ ను విడుదల చేశారు.

సోనీ పిక్చర్స్, సూపర్ స్టార్ మహేష్ జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో శోభితా ధూళిపాళ్ల, సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా నటించారు. తెలుగుతో పాటు హిందీ,మలయాళ భాషల్లో ఈ మూవీ విడుదల కానుంది.
![]() |
![]() |