![]() |
![]() |

వరుస విజయాలతో ముందుకు సాగుతున్న బుట్టబొమ్మ పూజా హెగ్డేకి.. `రాధే శ్యామ్`, `బీస్ట్` రూపంలో బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో.. రాబోయే `ఆచార్య`పైనే ఆశలు పెట్టుకుంది పూజా హెగ్డే. వేసవి కానుకగా ఈ నెల 29న ఈ సోషల్ డ్రామా జనం ముందుకు రానుంది.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. `మెగా` కాంపౌండ్ లో ఇప్పటివరకు పూజా హెగ్డే నటించిన సినిమాల్లో సింహభాగం విజయపథంలో పయనించాయి. `ముకుంద` (2014), `డీజే (దువ్వాడ జగన్నాథమ్)` (2017), `రంగస్థలం` (2018) (స్పెషల్ సాంగ్), `గద్దలకొండ గణేశ్` (2019), `అల వైకుంఠపురములో` (2020).. ఇలా `మెగా` క్యాంప్ లో ఇంతకుముందు పూజా హెగ్డే 5 చిత్రాల్లో సందడి చేయగా.. వాటిలో `ముకుంద` మినహా మిగిలినవన్నీ సక్సెస్ అయ్యాయి. మరి.. `ఆచార్య` విషయంలో కూడా `మెగా` ఫ్యాక్టర్ మళ్ళీ ప్లస్సయి.. పూజ తిరిగి సక్సెస్ ట్రాక్ లోకి వస్తుందేమో చూడాలి.
కాగా, `ఆచార్య`లో మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకులుగా నటించగా.. సోనూ సూద్ ప్రతినాయకుడిగా దర్శనమివ్వనున్నాడు. విజనరీ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతమందించారు.
![]() |
![]() |