![]() |
![]() |

దాదాపు 36 ఏళ్ళ క్రితం `విక్రమ్`(1986)గా అలరించారు లోక నాయకుడు కమల్ హాసన్. కట్ చేస్తే.. మళ్ళీ ఇప్పుడు అదే టైటిల్ తో మరో సినిమాతో పలకరించనున్నారీ వెర్సటైల్ స్టార్. `ఖైదీ`, `మాస్టర్` చిత్రాల దర్శకుడు లోకేశ్ కనకరాజ్ రూపొందిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్.. వేసవి కానుకగా ఈ ఏడాది జూన్ 3న విడుదల కానుంది.
ఇదిలా ఉంటే, `విక్రమ్` ట్రైలర్ కి సంబంధించి ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే.. మే 18న ఫ్రాన్స్ లో జరిగే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో `విక్రమ్` ట్రైలర్ ని రిలీజ్ చేయబోతున్నారు. మరి.. భారీ అంచనాల నడుమ విడుదల కాబోతున్న ఈ ట్రైలర్ ఏ స్థాయిలో మెస్మరైజ్ చేస్తుందో చూడాలి.
కాగా, `విక్రమ్`లో కమల్ హాసన్ తో పాటు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, మాలీవుడ్ స్టార్ ఫహద్ ఫాజిల్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై ఆర్. మహేంద్రన్ తో కలిసి కమల్ హాసన్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి కోలీవుడ్ యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తున్నాడు. `జల్లికట్టు` ఫేమ్ గిరీశ్ గంగాధరన్ ఈ సినిమాకి ఛాయాగ్రహణం అందిస్తున్నాడు.
![]() |
![]() |