![]() |
![]() |

పవన్ కల్యాణ్ టైటిల్ రోల్ పోషిస్తోన్న 'హరిహర వీరమల్లు' సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో వేసిన సెట్‌లో జరుగుతోంది. క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీని మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఎ.ఎం. రత్నం నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీ సెట్స్‌కు సంబంధించిన ఓ ఫొటో ఇప్పుడు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది. ఆ ఫొటోలో అప్పుడే షూట్ చేసిన ఓ ఇంటెన్స్ సీన్‌ను మానిటర్‌లో శ్రద్ధగా చూస్తున్నారు పవన్ కల్యాణ్. ఆయన పక్కనే ఓ వైపు క్రిష్, మరోవైపు సినిమాటోగ్రాఫర్ వి.ఎస్. జ్ఞానశేఖర్ కనిపిస్తున్నారు.
ఆ ఫొటోను షేర్ చేసిన క్రిష్, "When #HariHaraVeeraMallu passionately checking that Intense take!!!" అనే కామెంట్ పెట్టాడు. ఈ మూవీలో సంపన్నులను దోచుకొని, పేదలకు పంచే బందిపోటు దొంగ వీరమల్లుగా పవన్ కల్యాణ్ ఓ పవర్‌ఫుల్ రోల్ చేస్తున్నారు. ఆయన కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మాణమవుతోన్న ఈ మూవీలో బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ విలన్ రోల్ చేస్తుండగా, బాలీవుడ్ నటి నర్గీస్ ఫఖ్రి మరో కీలక పాత్రను చేస్తోంది.
17వ శతాబ్ద కాలంలో మొగలాయి సామ్రాజ్యం నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి పద్మశ్రీ తోట తరణి కళా దర్శకునిగా పనిచేస్తున్నారు. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ సినిమా విడుదల కానున్నది.
![]() |
![]() |