![]() |
![]() |

సుమంత్ హీరోగా నటిస్తోన్న చిత్రం 'అహం రీబూట్' ఫస్ట్ లుక్‌ను సీనియర్ రైటర్ విజయేంద్రప్రసాద్ ఆవిష్కరించారు. ప్రశాంత్ సాగర్ అట్లూరి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాని వాయుపుత్ర ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్ ఒరిజినల్స్ బ్యానర్లపై రఘువీర్ గోరిపర్తి, సృజన్ యరబోలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పోస్టర్‌లో సుమంత్ లుక్‌ను సరికొత్తగా డిజైన్ చేశారు. ఆయన ముఖంపై ఒకవైపు 'హెల్ప్ మీ' అనే అక్షరాలు రోల్ అవుతున్నాయి. సాయం చేయమని కోరుతున్నవాళ్లతో హెడ్ ఫోన్స్ పెట్టుకున్న సుమంత్ మాట్లాడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇంకోవైపు హెడ్‌ఫోన్స్ నుంచి 'ఎర్రర్' అనే సంకేతం కనిపిస్తోంది. సుమంత్ పాత్రకు తగ్గట్లుగా కాన్సెప్ట్ ను వివరిస్తున్న ఈ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది.
ఫస్ట్ లుక్‌ను ఆవిష్కరించిన విజయేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ, "ఈ కాన్సెప్ట్ వినగానే చాలా ఎగ్జైట్ అయ్యాను. చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింది. ఇలాంటి కథలకు ఇప్పుడు డిమాండ్ మరింత పెరిగింది. సైకలాజికల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో నటిస్తున్న సుమంత్ కి అభినందనలు. నిర్మాతలు రఘువీర్, సృజన్ యరబోలు, దర్శకుడు ప్రశాంత్ సాగర్, ఇతర టెక్నీషియన్స్‌కు ఆల్ ద బెస్ట్" అన్నారు.
దర్శకుడు ప్రశాంత్ సాగర్ అట్లూరి మాట్లాడుతూ, "అహం రీబూట్ తో ప్రేక్షకులకు కొత్త ఎక్స్‌పీరియన్స్‌ను అందించబోతున్నాము. అనుకోని సంఘటలను మనిషిలోని కొత్త కోణాలను , శక్తులకు బయటకు తెస్తాయి. అవి చాలా థ్రిల్లింగ్ గా ఉంటాయి. అలాంటి కథే అహం రీబూట్. సుమంత్ నటన చాలా హైలెట్ గా ఉంటుంది. దర్శకునిగా ఈ కథను ప్రేక్షకులకు ముందుకు ఎప్పుడు తెస్తానా అనే ఎగ్జైట్ మెంట్‌తో ఉన్నాను" అన్నారు.

నిర్మాత రఘువీర్ గోరిపర్తి మాట్లాడుతూ, "మా సినిమా కాన్సెప్ట్ విజయేంద్రప్రసాద్ గారికి ఆసక్తిగా అనిపించడం చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. జూన్ మొదటివారంలో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నాం. ఈ సినిమా మా బ్యానర్‌కి మంచి ఇమేజ్‌ని తెస్తుందని నమ్ముతున్నాను." అన్నారు.
ఈ చిత్రానికి సంగీతం: శ్రీరామ్ మద్దూరి, సినిమాటోగ్రఫీ: వరుణ్ అంకర్ల, స్క్రిప్ట్ సూపర్‌విజన్: సుమ కార్తికేయ, ప్రొడక్షన్ డిజైన్: ఏఆర్ వంశీ.
![]() |
![]() |