![]() |
![]() |

నేషనల్ క్రష్ రష్మికా మందన్న జీవితంలో కన్నడ స్టార్ రక్షిత్ శెట్టి పాత్ర ఏంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కన్నడ బ్లాక్ బస్టర్ `కిరిక్ పార్టీ` (2016)లో జోడీగా నటించిన రక్షిత్, రష్మిక.. ఆపై రియల్ లైఫ్ లో నిశ్చితార్థం వరకు వెళ్ళారు. అయితే, అనూహ్యంగా ఇద్దరూ విడిపోయారు. ఎవరి కెరీర్ లో వారు బిజీగా ముందుకు సాగుతున్నారు. అలాంటి రష్మిక, రక్షిత్.. త్వరలో బాక్సాఫీస్ వార్ కి రెడీ అవుతున్నారు.
ఆ వివరాల్లోకి వెళితే.. ఇప్పటికే కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో నటిగా తనదైన ముద్ర వేసిన రష్మిక త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. `మిషన్ మజ్ను` పేరుతో తెరకెక్కిన ఆమె తొలి హిందీ చిత్రం ఈ ఏడాది జూన్ 10న రిలీజ్ కి రెడీ అయింది. కట్ చేస్తే.. ఇప్పుడు అదే రోజు రక్షిత్ నటించిన కొత్త చిత్రం విడుదలకు సిద్ధమైంది. `777 చార్లి` పేరుతో రూపొందిన ఈ అడ్వెంచరస్ కామెడీ డ్రామాని జూన్ 10న రిలీజ్ చేయబోతున్నట్లు తాజాగా ప్రకటించాడు రక్షిత్. అంతేకాదు.. కన్నడతో పాటు తెలుగు, హిందీ, తమిళ్, మలయాళ భాషల్లో ఈ సినిమా అదే రోజున రాబోతున్నట్లు పోస్టర్స్ ద్వారా చెప్పకనే చెప్పేశాడు. సో.. జూన్ 10న హిందీనాట రష్మిక వర్సెస్ రక్షిత్ అన్నట్లుగా బాక్సాఫీస్ పోరు ఉండబోతోందన్నమాట. మరి.. ఈ పోటీలో ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి.
![]() |
![]() |