![]() |
![]() |

సినీ పరిశ్రమకి తెలంగాణ ప్రభుత్వం వరుసగా గుడ్ న్యూస్ లు చెబుతోంది. ఇప్పటికే సినిమా టికెట్ ధరలు పెంచిన ప్రభుత్వం.. డిస్ట్రిబ్యూటర్ల కోరిక మేరకు పెద్ద సినిమాలకు ఐదో షోలకు అనుమతులు ఇస్తూ వచ్చింది. రీసెంట్ విడుదలైన 'భీమ్లా నాయక్'కి కూడా ఐదో షోకి పర్మిషన్ ఇచ్చింది. ఇక తాజాగా అన్ని సినిమాలకి ఐదు షోలకి అనుమతి ఇవ్వడం విశేషం.
తెలంగాణలో ఐదు షోలకు అనుమతి ఇస్తూ తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఉదయం 10 గంటల నుంచి అర్థరాత్రి 1 గంట మధ్యలో ఐదు షోలు వేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. ఇది రాష్ట్రంలోని అన్ని థియేటర్స్ కి వర్తించనుంది. ఈ నిర్ణయం భారీ బడ్జెట్ తో తెరకెక్కే సినిమాలకు లాభం చేకూర్చనుంది. ముఖ్యంగా రేపు(మార్చి 11 న) విడుదలవుతున్న 'రాధేశ్యామ్', మార్చి 25 న రిలీజ్ అవుతున్న 'ఆర్ఆర్ఆర్' సినిమాలకు లాభం చేకూరనుంది.

తెలంగాణలో ఇలా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పరిస్థితి మరోలా ఉంది. మొన్నటివరకు టికెట్ ధరలు బాగా తగ్గించిన ఏపీ ప్రభుత్వం సినీ పరిశ్రమ రిక్వెస్ట్ తో అతికష్టం మీద పెంచింది. అలాగే ఐదో షోకి అనుమతి ఇచ్చింది కానీ, అందులో ఒక షో తక్కువ బడ్జెట్ సినిమాకి కేటాయించాలని షరతు పెట్టింది.
![]() |
![]() |