![]() |
![]() |

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన సినిమా 'రాధేశ్యామ్'. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 11 న ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ అంచనాల నడుమ విడుదలవుతున్న ఈ పీరియాడిక్ లవ్ స్టోరీ ప్రీరిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరిగింది. అయితే ఇది ప్రభాస్ గత చిత్రం 'సాహో'తో పోల్చితే తక్కువ కావడం విశేషం.
తెలుగు రాష్ట్రాల్లో 'రాధేశ్యామ్' ప్రీరిలీజ్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరిగింది. ఈ మూవీ ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి రూ.105.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. నైజాం(తెలంగాణ)లో 36.50 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా.. ఏపీలో మొత్తం రూ.68.70( సీడెడ్: 18 కోట్లు, ఉత్తరాంధ్ర: 13 కోట్లు, ఈస్ట్ గోదావరి: 8.80 కోట్లు, వెస్ట్ గోదావరి: 7.50 కోట్లు, గుంటూరు: 9.90 కోట్లు, కృష్ణా: 7.50 కోట్లు, నెల్లూరు: 4 కోట్లు) కోట్ల బిజినెస్ చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో రూ.105.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన రాధేశ్యామ్.. హిందీ వెర్షన్ 50 కోట్లు, కర్ణాటక 12.50 కోట్లు, తమిళనాడు 6 కోట్లు, కేరళ 2.10 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 3 కోట్లు, ఓవర్సీస్లో 24 కోట్ల బిజినెస్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.202.80 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ ఈ మూవీ రూ.204 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగుతోంది.
ప్రభాస్ లాస్ట్ మూవీ సాహో 270 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా.. రాధేశ్యామ్ మాత్రం 202.80 కోట్లకు పరిమితమైంది. సాహో హిందీ మినహా వేరే చోట్ల నష్టాలను చూడటం, దానికితోడు రాధేశ్యామ్ లవ్ స్టోరీ కావడంతో బిజినెస్ తగ్గినట్లు తెలుస్తోంది. అయితే ఒక లవ్ స్టోరీకి 200 కోట్లకు పైగా బిజినెస్ జరగడం విశేషమనే చెప్పాలి.
![]() |
![]() |