![]() |
![]() |

కొందరికి కొన్ని ఫ్యాక్టర్స్ భలేగా అచ్చొస్తాయి. నేచురల్ స్టార్ నాని కూడా ఇందుకు మినహాయింపు కాదు. అదేమిటంటే.. తన సినిమాకి ఏదో రకంగా `నటసింహం నందమూరి బాలకృష్ణ` టచ్ ఉంటే సక్సెస్ పక్కా.
ఆ వివరాల్లోకి వెళితే.. నాని రెండో సినిమాగా రిలీజైన `రైడ్` (2009)లో బాలయ్య చార్ట్ బస్టర్ సాంగ్ ``దంచవే మేనత్త కూతురా`` తాలుకూ రీమిక్స్ ఉంటుంది. సెన్సేషనల్ మూవీ `మంగమ్మ గారి మనవడు`లోని ఆల్ టైమ్ హిట్ నంబర్ అయిన ఈ పాటలో అక్షతో కలిసి చిందులేసి ఓ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు నాని. ఆపై 2016లో రిలీజైన `కృష్ణగాడి వీరప్రేమగాథ`లో ఏకంగా బాలయ్య వీరాభిమానిగా కనిపించి ఇంకో కమర్షియల్ హిట్ క్రెడిట్ చేసుకున్నాడు. అలా.. రెండు సార్లు `బాలయ్య` ఫ్యాక్టర్ నానికి భలేగా అచ్చొచ్చింది.
కట్ చేస్తే.. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి బాలయ్య ఫ్యాక్టర్ ని టచ్ చేస్తున్నాడు నాని. అదెలాగంటే.. తన తాజా చిత్రం `అంటే.. సుందరానికీ!` బాలకృష్ణ పుట్టినరోజైన జూన్ 10న తెరపైకి వస్తోంది. మరి.. ముచ్చటగా మూడోసారి బాలయ్య ఫ్యాక్టర్ ని టచ్ చేస్తున్న నాని.. ఈ సారి కూడా సక్సెస్ అందుకుంటాడేమో చూడాలి.
కాగా, `అంటే.. సుందరానికీ!`లో నానికి జోడీగా నజ్రీయా ఫహద్ నటించింది. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ కామెడీ డ్రామాని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది.
![]() |
![]() |