![]() |
![]() |

ఫీల్ గుడ్ ఎంటర్టైనర్స్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచే దర్శకుల్లో కిశోర్ తిరుమల ఒకరు. `నేను శైలజ`, `ఉన్నది ఒకటే జిందగీ`, `చిత్రలహరి` వంటి ఫీల్ గుడ్ మూవీస్ తరువాత కిశోర్ నుంచి రాబోతున్న ఆ తరహా చిత్రం `ఆడవాళ్ళు మీకు జోహార్లు!`. యువ కథానాయకుడు శర్వానంద్ నటించిన ఈ సినిమా.. ఫిబ్రవరి 25న థియేటర్లలో ఎంటర్టైన్ చేయనుంది. `పడి పడి లేచె మనసు`, `రణరంగం`, `జాను`, `శ్రీకారం`, `మహాసముద్రం`.. ఇలా వరుస పరాజయాల్లో ఉన్న శర్వానంద్ కి ఈ చిత్రం ఫలితం ఎంతో కీలకంగా మారింది.
Also Read: మంచు ఫ్యామిలీతో పేర్ని నాని భేటీ.. మోహన్ బాబే అసలైన పెదరాయుడు!
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. ఐదు లేదా అంతకుమించి అపజయాలతో ఉన్న నోటబుల్ హీరోస్.. కిశోర్ తిరుమలతో తొలిసారిగా జట్టుకడితే మళ్ళీ ట్రాక్ లోకి రావడం ఖాయం. `ఎందుకంటే ప్రేమంట`, `ఒంగోలు గిత్త`, `మసాలా`, `పండగ చేస్కో`, `శివమ్`.. ఇలా ఐదు వరుస ఫ్లాప్స్ తో ఉన్న రామ్ కి కిశోర్ తిరుమలతో ఫస్ట్ టైమ్ కలిసి పనిచేసిన `నేను శైలజ` సక్సెస్ ని అందించింది. అలాగే `తిక్క`, `విన్నర్`, `నక్షత్రం`, `జవాన్`, `ఇంటిలిజెంట్`, `తేజ్ ఐ లవ్ యు`.. ఇలా అరడజను అపజయాలతో రేసులో వెనుకబడ్డ సాయితేజ్ కి కిశోర్ తిరుమలతో మొదటిసారిగా వర్క్ చేసిన `చిత్రలహరి` ఊరటనిచ్చింది. ఈ నేపథ్యంలో.. రామ్, సాయితేజ్ తరహాలో శర్వానంద్ కూడా కిశోర్ తిరుమల సెంటిమెంట్ సమేతంగా మళ్ళీ విజయపథంలోకి వస్తాడేమో చూడాలి.
![]() |
![]() |